రాష్ట్రీయం

సెట్ల నోటిఫికేషన్లు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణలో మూడు ముఖ్యమైన ప్రవేశపరీక్షల నోటిఫికేషన్లను సోమవారం నాడు విడుదల చేశారు. ఎమ్సెట్ నోటిఫికేషన్, ఇసెట్ నోటిఫికేషన్, లాసెట్ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు. జెఎన్‌టియు కూకట్‌పల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఎమ్సెట్, ఇసెట్ నోటిఫికేషన్లను విడుదల చేసి షెడ్యూళ్లను ప్రకటించారు. ఎమ్సెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 27న ఇస్తామని, మార్చి 3 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ 3 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించుకోవచ్చని అన్నారు. ఏప్రిల్ 7 నుండి 20వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో
డాటా సవరించుకోవచ్చని, ఏప్రిల్ 12 వరకూ 500 జరిమానాతో, ఏప్రిల్ 21 వరకూ వెయ్యి జరిమానాతో, ఏప్రిల్ 29 వరకూ 5వేల జరిమానాతో దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు. హాల్‌టిక్కెట్లను మే 1 నుండి 9వ తేదీ వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని 10వేల జరిమానాతో మే 8వ తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించుకునే వీలుందని అన్నారు. పరీక్ష మే 12న జరుగుతుందని, ఇంజనీరింగ్ స్ట్రీం ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ, అగ్రికల్చర్ స్ట్రీం మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ ఉంటుందని చెప్పారు. తొలి కీ మే 13న విడుదల చేస్తామని, అభ్యంతరాలుంటే మే 18 వరకూ సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఫలితాలను మే 22న విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు విసి ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, ఇసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎమ్సెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్, ఇసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రాలో మూడు కేంద్రాలు
తెలంగాణ ఎమ్సెట్ రాసేందుకు ఆంధ్రాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని కన్వీనర్ యాదయ్య చెప్పారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలో ఈ కేంద్రాలుంటాయని చెప్పారు. ఈసారి హైదరాబాద్ సహా మొత్తం 20 రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నిర్మల్, భువనగిరి, శంషాబాద్, పెద్దపల్లిలో కొత్తగా రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఆరు జోన్లుగా విడదీశామని, దాని వల్ల ఏ జోన్ విద్యార్ధులు అదే జోన్‌లో పరీక్ష రాసేందుకు వీలవుతుందని వివరించారు.
వైద్య శాఖకు లేఖ
అగ్రికల్చర్ స్ట్రీం పరీక్ష నిర్వహణకు సంబంధించి స్పష్టత కోసం వైద్య శాఖకు లేఖ రాశామని, వారి నుండి సమాధానం రాగానే అగ్రికల్చర్ స్ట్రీం పరీక్షపై ఒక స్పష్టత వస్తుందని కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.
మే 6న ఇసెట్
ఈసారి ఇసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పాపిరెడ్డి తెలిపారు. నోటిఫికేషన్‌ను 27న విడుదల చేస్తామని, దరఖాస్తులు మార్చి 2 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకూ స్వీకరిస్తామని, ఆన్‌లైన్‌లో డాటా సరిచేసుకునేందుకు ఏప్రిల్ 15 నుండి 20 వరకూ గడువు ఇచ్చామని అన్నారు. 500 జరిమానాతో ఏప్రిల్ 13 వరకూ, వెయ్యి జరిమానాతో ఏప్రిల్ 20 వరకూ, 5వేల జరిమానాతో ఏప్రిల్ 24 వరకూ స్వీకరిస్తున్నామని అన్నారు. హాల్‌టిక్కెట్లు ఏప్రిల్ 29 నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, 10వేల జరిమానాతో మే 1 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. పరీక్ష సాయంత్రం 2 నుండి 5 వరకూ జరుగుతందని, తొలి కీ మే 8న విడుదల చేస్తామని, అభ్యంతరాలుంటే మే 11 వరకూ స్వీకరించి, మే 15న ఫలితాలు ఇస్తామని చెప్పారు. ర్యాంకు కార్డులు మే 17 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
మే 27న లాసెట్
తెలంగాణ లాసెట్ పరీక్షను మే 27న నిర్వహిస్తారు. ఇందుకు ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మార్చి 4 నుండి ఏప్రిల్ 4 వరకూ 350 రూపాయిల ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లాసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ సాయన్న,,కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవి రంగారావు తెలిపారు. పరీక్ష మే 27న జరుగుతుందని ఉదయం 10 నుండి 11.30 వరకూ టిఎస్ లాసెట్ యుజి, సాయంత్రం 2.30 నుండి 4 గంటల వరకూ టిఎస్ లాసెట్ పిజి పరీక్షలు జరుగుతాయని వివరించారు. మూడేళ్ల లా కోర్సుకు గరిష్టంగా 30 ఏళ్లు, ఐదేళ్ల లా కోర్సునకు గరిష్టంగా 20 ఏళ్లు నిర్ధారిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత ఏడాది సెప్టెంబర్ 17న లేఖ రాసిందని అయితే ఎస్సీ, ఎస్టీ , బిసిలకు మాత్రం ఐదేళ్లు వయోపరిమితి రాయితీ ఇచ్చిందని అన్నారు. ఐదేళ్ల యుజి కోర్సునకు రెండేళ్ల వయోపరిమితి రాయితీ లభిస్తుందని అన్నారు.