రాష్ట్రీయం

ర్యాలీ 26న పెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ జాక్ నిర్వహించదలచిన నిరసన ర్యాలీని 22కు బదులు ఆదివారం సెలవు రోజైన 26న నిర్వహించేందుకు సిద్ధమేనా? అంటూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ప్రశ్నించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాక్ విద్యావంతుల వేదిక నిర్వహించతలపెట్టిన ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ ప్రొఫెసర్ ఎం కోదండరామ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ఈమేరకు ఆదేశాలిచ్చారు. ఆదివారం నిర్వహించినట్టయితే ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉంటుందని, ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయమూర్తి చేసిన సూచనపై తమ క్లయింట్‌కు వివరిస్తామని కోదండరామ్ తరఫున హాజరైన న్యాయవాది బి రచనా రెడ్డి కోర్టుకు వివరించారు. అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంటూ నగర కమిషనర్ ర్యాలీకి అనుమతి నిరాకరించడం చూస్తుంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని న్యాయవాది పేర్కొన్నారు. ర్యాలీల సమయంలో కొంత నియంత్రణ వాంఛనీయమే అయినా, పూర్తిగా నిరాకరించడం సరికాదని పేర్కొంటూ న్యాయవాది సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో జరిగిన జల్లికట్టు తరహాలో టిజాక్ విద్యార్థులను సమీకరిస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. తొలుత 1500 మంది వరకూ నిరుద్యోగులు కలిసి సమావేశం అవుతామని చెప్పారని, తర్వాత 31 జిల్లాల్లో 138 పట్టణాలు తిరిగి పెద్దఎత్తున నిరుద్యోగులను సమీకరించినట్టు చెప్పారు. గతంలోనూ టిజాక్ ఇలాంటి ర్యాలీలు నిర్వహించిందని, అందులో విధ్వంసం జరిగిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. ఎంత మంది పాల్గొంటారనే సంఖ్య ఇవ్వడానికి పిటిషనర్ సుముఖంగా లేరని, విప్లవ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం ఉందని ఎజి పేర్కొన్నారు. బాగ్‌లింగంపల్లి నుండి ఆర్టీసీ ఎక్స్‌రోడ్ మీదుగా ఇందిరాపార్కు వరకూ ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నారని, ఆ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. ఎలాంటి విధ్వంసం జరగకుండా 3.1 కిలోమీటర్లు పొడవున ర్యాలీని పర్యవేక్షించడం పోలీసులకు కష్టతరమైన పని అని పేర్కొన్నారు. ఇందిరాపార్కు
నగరంలో చాలా కీలక కేంద్రంలో ఉందని, అక్కడ చాలా సంస్థలు, విద్యాలయాలు, సమీపంలో సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు గుమిగూడితే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందన్నారు. శంషాబాద్ ఎస్‌ఎస్ కనె్వన్షన్ లేదా నాగోలు మెట్రో రైలు వద్ద లేదంటే మియాపూర్, అబ్దుల్లాపూర్‌మెట్ట, చిర్యాల గ్రామాల్లో తక్కువ జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించుకోవాలని ఎజి సూచించారు. దీనిపై న్యాయమూర్తి పలు ప్రత్యామ్నాయాలను పిటిషనర్‌కు సూచించారు. సమావేశాన్ని నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించుకోవాలని, కావాలంటే ఎన్టీఆర్ స్టేడియంను పార్కింగ్‌కు ఉపయోగించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అలాగే ఆదివారం నిర్వహించుకునేందుకు పునరాలోచించాలని సూచించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.