ఆంధ్రప్రదేశ్‌

కోనేరు ప్రదీప్ నివాసంలో సిబిఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఎమ్మార్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ కొడుకు కోనేరు ప్రదీప్ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ప్రసాద్ నివాసంలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ఢిల్లీ, చెన్నైలోని ఆయన కార్యాలయాలలో చేపట్టిన సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లో కూడా సిబిఐ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా, మాంసం వ్యాపారి ఖురేషితో గల సంబంధాలపై ఆరా తీసేందుకు ప్రసాద్ ఇంట్లో సోదాలు జరుపుతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. రంజిత్ సిన్హా సిబిఐ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ కోసం ఖురేషి అనే మాంసం వ్యాపారి ద్వారా అతని కొడుకు ప్రదీప్ కలిశారని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రంజిత్ సిన్హా వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ప్రదీప్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.