రాష్ట్రీయం

తిరుపతిలో కెసిఆర్‌కు స్వాగత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఫిబ్రవరి 20: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రెండు రోజుల తిరుమల, తిరుపతి పర్యటన సందర్భంగా రేణిగుంట నుంచి తిరుపతి వరకు స్వాగత బ్యానర్లు, కటౌట్లు, వాల్‌పోస్టర్లు వెలిశాయి. తమిళనాడు తెలుగు వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, కార్యదర్శి శేష ప్రసాద్ చౌదరి తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకు రోడ్డుకు ఇరువైపులా కెసిఆర్ పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. కాగా రేణిగుంట రమణావిలాస్ కూడలి, విమానాశ్రయ కూడలిలో వెలిసిన కెసిఆర్ స్వాగత బ్యానర్లను, తిరుపతిలో రహదారి వెంబడి అంటించిన పోస్టర్లను తహశీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇది వివాదానికి దారితీసింది. కెసిఆర్‌కు స్వాగతం పలకడం తప్పా అని అభిమానులు ప్రశ్నిస్తుంటే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగాను, నిబంధనలు పాటించనందుకే తొలగించామని అధికారులు చెప్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ అభిమానులకు, తహశీల్దార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కెసిఆర్ అభిమాని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం చంద్రబాబు మెప్పు పొందేందుకు కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఆదేశించి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇది తెలుగు రాష్ట్రాలకు మంచి సంప్రదాయం కాదని, ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు విచారణ చేపట్టి జిల్లాకలెక్టర్, పిఆర్‌వో, డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్, స్థానిక తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై రేణిగుంట తహశీల్దార్ రాజగోపాల్ వివరణ ఇస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల విమానాశ్రయ సమీపాల్లో స్వాగత బ్యానర్లు తొలగించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో విద్యుత్ స్తంభాలకు స్వాగత బ్యానర్లు అమర్చకూడదని, అందుకే తొలగించామని చెప్పారు. ప్రైవేటు ప్రాపర్టీస్‌లో, ప్రైవేటు భవనాల్లో పంచాయతీకి సంబంధించిన భూముల్లో ఆయా యజమానులు, ఆయా కార్యదర్శుల వద్ద పన్నులు చెల్లించి బ్యానర్లు పెట్టుకోవచ్చని తెలిపారు. తెలంగాణ సిఎంకు స్వాగతం పలకదలచినవారు ఈ నిబంధనలు పాటించలేదని, ఎన్నికల కోడ్‌ను పట్టించుకోలేదని వివరించారు.

చిత్రం..కెసిఆర్ స్వాగత పోస్టర్లను చించేసిన దృశ్యం