రాష్ట్రీయం

జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఫిబ్రవరి 20: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం కన్సూలూరు ఆశ్రమ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతిచెందింది. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా సకాలంలో స్పందించలేదనే కారణంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్‌ను అధికార్లు సస్పెండ్‌చేశారు. వివరాలిలావున్నాయి... కన్సూలూరు ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పొడియం సంకురమ్మ (12) గత కొన్ని రోజుల నుండి జ్వరంతో బాధపడుతోంది. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. జ్వరం తీవ్రం కావడంతో ఉపాధ్యాయులు సంకురమ్మను శనివారం చింతూరు వైద్యశాలకు తీసుకువచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సైతం పరిస్థితి చేయిదాటిపోయిందని, సంకురమ్మను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించారు. దీంతో బాలిక తండ్రి గంగయ్య భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం సంకురమ్మ మృతిచెందింది. కాగా నిర్లక్ష్యంగా వ్యవహరించి, విద్యార్థిని మృతికి కారణమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర్లు, వార్డెన్ కె బాలకృష్ణను ఐటిడిఎ పిఒ చినబాబు సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని ఎపిఒ వెంకటేశ్వర్లును ఆదేశించారు. కాగా సంకురమ్మ మృతికి కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం కారణంగానే విద్యార్థులు మృతిచెందుతున్నారని శ్రీను ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలలో ఎఎన్‌ఎంలను నియమించాలని కోరారు.