రాష్ట్రీయం

ఆదాయం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21:ఆదాయ వనరులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గరిష్ఠంగా నిధులు పొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యువత, మహిళల కోసం కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రతిపాదించేందుకు కసరత్తు చేస్తున్నామని, నిధుల సమీకరణకు ఆరు సంస్థల ఏర్పాటు యోచన ఉందనీ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా వెలగపూడి సచివాలయంలో ఆయన వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ వివిధ శాఖల నుంచి మరింతగా ఆదాయం లభించే అవకాశం ఉందని, దీనిపై దృష్టి సారించి తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. సాంకేతికతను ఉపయోగించి, ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే వివరాలను విశే్లషించాలన్నారు. ఆ సర్వే ఆధారంగా గ్రామాల్లో కుటుంబ వ్యక్తిగత ఆదాయాన్ని గుర్తించాలన్నారు. ఆధార్ కార్డులను అనుసంధానం చేయడం ద్వారా ఆదాయ వివరాలను సేకరించే వీలు ఉందన్నారు. దీనివల్ల గ్రామాల్లో కుటుంబ ఆదాయం వివరాలు మదింపు చేయవచ్చని, గ్రామ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టవచ్చాన్నారు. ఉపాధి హామీ పథకం కింద 153 రకాల పనులు చేపట్టవచ్చాన్నారు. ఈ పథకం కింద వీలైనన్ని నిధులను రాబట్టేలా అన్ని శాఖలు తమ పరిధిలో కసరత్తు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు మిషన్‌లను ఈ పథకంతో అనుసంధానం చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరాన్ని ఇ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించామన్నారు. నిధుల సమీకరణకు జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్, రైతు సాధికారత కార్పొరేషన్, మహిళా సాధికార సంస్థ, మున్సిపల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి ఆరు సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని సిఎం తెలిపారు.

చిత్రం..మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు