రాష్ట్రీయం

నేతన్నలకు త్వరలో రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 21: ఆర్థికంగా చితికిన చేనేత రంగం, దానిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా 25వేల మంది కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే చేనేత రుణమాఫీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.110.96 కోట్లు మంజూరు చేసింది. దీనిలో రూ.72 కోట్లను ఇప్పటికే చేనేత కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోగా మిగిలిన చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించింది. రుణమాఫీ ద్వారా రాష్టవ్య్రాప్తంగా 25,567 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. తరువాత కూడా చేనేత కార్మికులకు కొత్త రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు వీలు కల్పిస్తూ బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.