రాష్ట్రీయం

13న బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను వెలగపూడిలో నిర్మించిన కొత్త శాసనసభ భవనంలో మార్చి 6 నుంచి నిర్వహించనున్నారు. 13న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశ తేదీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సూత్రప్రాయంగా వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో 2017-18 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వివిధ శాఖాధిపతులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాసనసభకు, కార్యాలయాలకు మధ్య దూరం ఎక్కువగా ఉండేదని, కానీ వెలగపూడిలో ఆ సమస్య లేదనీ అన్నా రు. పారిశ్రామిక అభివృద్ధి కళ్లకు కనబడేలా రానున్న బడ్జెట్‌ను రూపొందించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఫలితాలు రాబట్టేదిగా ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. అదే సమయంలో అభివృద్ధి విస్తృతంగా జరగాలన్నారు. నిధుల ఏకీకరణ, మళ్లింపుతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలిగామని, పల్లెల్లో ప్రగతి పెద్దఎత్తున జరిగిందని, ఈ సారి కూడా అదే పంథాను అనుసరించాలన్నారు. నవ్యాంధ్ర నిలదొక్కుకుని, అగ్రస్థానానికి చేరాలంటే మరో నాలుగేళ్లు శ్రమించాలని, ప్రజలు సంతృప్తి చెందేలా ఆయా శాఖల పనితీరు ఉండాలన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రభుత్వ శాఖల బడ్జెట్‌పై కసరత్తుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు.