రాష్ట్రీయం

కెసిఆర్‌కు అపూర్వ స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 21: తెలంగాణ సిఎం హోదాలో కె చంద్రశేఖర్‌రావు తొలిసారిగా తన కుటుంబీకులతో శ్రీవారి దర్శనానికి మంగళవారం తిరుమల చేరుకున్నారు. సాయంత్రం 6.10కు ప్రత్యేక విమానంలో కెసిఆర్ దంపతులు, మంత్రి కెటిఆర్, కుమార్తె, ఎంపి కవితలతోపాటు ఇతర కుటుంబీకులతో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈసందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కెసిఆర్‌కు స్వాగతం పలకడానికి పార్టీలకు అతీతంగా అభిమానులు పెద్దఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. 40 ఏళ్లుగా పరిచయమున్న తిరుపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి మూడు వేల మందితో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వాస్తవానికి కెసిఆర్ తిరుగు ప్రయాణంలో బుధవారం శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఉంది. అయితే సిఎం హోదాలో తొలిసారిగా కెసిఆర్ కుటుంబీకులతో తిరుమలకు రావడమే కాకుండా స్వామివారికి ప్రభుత్వం తరపున కానుకలను సమర్పించనున్నారు. పుణ్యక్షేత్రాలను దర్శించిన తరువాత నేరుగా ఇంటికి వెళ్తేనే ఫలం దక్కుతుందన్న పండితుల సూచన మేరకు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్ళే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఇదే విషయాన్ని శంకర్‌రెడ్డికి కూడా తెలిపి మరోమారు ఇంటికి వస్తానని హామీ ఇచ్చారు. ఇదిలావుండగా రేణిగుంట నుంచి కారులో బయలుదేరి 7.10కు తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిభవనం చేరుకున్నారు. తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. అనంతరం టిటిడి ఇవో డాక్టర్ డి.సాంబశివరావు కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా బుధవారం ఏ సమయంలో దర్శనానికి వెళ్ళాలి, ఎప్పుడు తాను రాష్ట్రప్రభుత్వం తరపున వెంట తెచ్చిన రూ.5కోట్ల విలువచేసే సాలిగ్రామహారం, మకరకంఠి కానుకలను ఇవ్వాలో ఇవో, జెఇవోలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలావుంటే, బుధవారం ఉదయం 8 గంటలకు కెసిఆర్ తన కుటుంబీకులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మొక్కులను స్వామికి సమర్పిస్తారు. తరువాత పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 10గంటలకు పుష్పగిరి మఠంలో జరుగనున్న సివిల్ సప్లై చైర్మన్ సుదర్శన్ రెడ్డి వివాహానికి హాజరవుతారు. అక్కడ నుంచి తిరుచానూరుకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని బంగారు ముక్కపుడక సమర్పిస్తారు.
కెసిఆర్ రేణిగుంట విమానాశ్రయం చేరుకోవడానికి ముందే సాయంత్రం 4.30గంటలకు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి పద్మారావుగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి తదితరులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వారు తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. ఈసందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఐజి ప్రభాకర్‌రావు, ఎస్పీ జయలక్ష్మి పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కెసిఆర్‌ను కలిసిన పెద్దిరెడ్డి, చెవిరెడ్డి
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఆయన బసచేసిన కృష్ణ అతిథి భవనంలో వైకాపా రాజంపేట ఎంపి మిథన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు అతిథిభవనం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌తో ఉన్న పాత పరిచయంతోనే ఆయనను మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చామని చెప్పారు.

చిత్రం..రేణిగుంట విమానాశ్రయంలో కెసిఆర్‌కు స్వాగతం పలుకుతున్న మంత్రి బొజ్జల