రాష్ట్రీయం

విరాట్ పై ఆశలు ఆవిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 21:్భరత నౌకాదళంలో విశేష సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఇక ముక్కచెక్కలు కాబోతోంది. అత్యంత సాసహసోపేతమైన యుద్ధనౌకగా పేరొందిన విరాట్ కొద్ది రోజుల కిందటే భారత నౌకాదళంలో సేవలు ముగించుకుంది. వచ్చే నెల ఆరవ తేదీన ముంబైలో ఈ నౌకకు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. వెనువెంటనే దాన్ని విశాఖకు తీసుకువచ్చి, 13 అంతస్తుల ఫ్లోటింగ్ హోటల్, మ్యూజియంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది సాధ్యం కాదని తేలిపోయింది.
ఈ నౌకను విశాఖకు తీసుకువచ్చి, ఫ్లోటింగ్ హోటల్ కం మ్యూజియంగా తీర్చిదిద్దడానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మిగిలిన 500 కోట్ల రూపాయల ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తర్జనభర్జన జరిగింది. చివరకు అంత మొత్తాన్ని భరించలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. అవసరమైతే ఆ నౌక నిర్వహణకు అవసరమైన సాంకేతిక నిపుణులను మాత్రం ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఈ నౌక విశాఖకు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి.
విక్రాంత్ అనుభవాలే కారణమా?
గతంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకాదళంలో సేవలు ముగిసిన తరువాత ముంబై తీరంలో ఫ్లోటింగ్ హోటల్‌గా ఏర్పాటు చేశారు. అయితే, దాని నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. చివరకు ఆ నౌకను స్క్రాప్‌కు విక్రయించాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వెయ్యి కోట్లు ఖర్చు చేసి విరాట్‌ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతున్నట్టు తెలిసింది. విశాఖలో ఆర్‌కె బీచ్‌లో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ ప్రస్తుతం వుడా నిర్వహణలో ఉంది. ఈ మ్యూజియం ద్వారా వచ్చే ఆదాయం కన్నా, నిర్వహణకు అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటోంది. పైగా సముద్ర తీరం కోతకు గురైనప్పుడల్లా, ఈ సబ్‌మెరైన్‌కు ముప్పు ముంచుకొస్తూనే ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విరాట్‌ను తీసుకోడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని తెలుస్తోంది.
సుమారు 58 సంవత్సరాలపాటు బ్రిటిష్, భారత నౌకాదళంలో సేవలందించిన విరాట్ తన సుదీర్ఘ ప్రయాణంలో సుమారు ఐదు లక్షల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. 1959 నవంబర్ 18న బ్రిటిష్ నేవీ విధుల్లో చేరింది. 1982లో జరిగిన ఫాక్‌లాండ్స్ వార్‌లో బ్రిటిష్ నౌకాదళాన్ని ఈ విరాటే ముందుండి నడిపించింది. 1987 మే రెండో తేదీన భారత నౌకాదళంలో చేరింది. భారత నౌకాదళంలో విరాట్ సేవలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిసి, దీన్ని మ్యూజియంగా తీసుకునేందుకు భారత దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాలు 2015లో ముందుకు వచ్చాయి. 2017 మార్చి ఆరవ తేదీన ఈ నౌక పూర్తిగా విధుల నుంచి వైదొలగనుంది.

చిత్రం..విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్