రాష్ట్రీయం

మిర్చి ధర.. ప్చ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 21: తెగుళ్లు, నకిలీ విత్తనాలతో పంట చేతికి రాక కన్నీరు పెట్టే రైతన్న, ఇప్పుడు పంట విరగకాసినా కన్నీరు పెడుతున్నాడు. ఎడ్లబండ్లపై పంట తీసుకొచ్చిన రైతుకు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లభించడం లేదు. గత ఏడాది ఇదే సమయానికి క్వింటాల్‌కు 10 వేల నుంచి 12 వేల రూపాయలు పలికిన మిర్చి ధర ప్రస్తుతం 4 నుంచి 5వేలకు పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవటంతో గుంటూరు మిర్చి యార్డులో లక్షలాది టిక్కీల నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు పంటను అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మార్కెట్‌యార్డుకు రైతులు పెద్దయెత్తున మిర్చి తరలిస్తున్నారు. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మిర్చి యార్డులో కోలాహలం నెలకొంది. మంగళవారం ఒక్కరోజే 1,39,745 బస్తాలు యార్డుకు వచ్చాయి. మరోవైపు విక్రయాలు కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రానికి యార్డులో ఇంకా 2,72,313 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఎసి కామన్ వెరైటీ క్వింటాల్ సరాసరి 4 వేల రూపాయలు ధర పలకగా అత్యధికంగా 8,900 రూపాయలకు కొనుగోళ్లు జరిగాయి. నాన్ ఎసి స్పెషల్ వెరైటీ క్వింటాల్‌కు సరాసరి 5 వేల రూపాయలు కాగా అత్యధికంగా 12,200, ఎసి కామన్ వెరైటీ సరాసరి 5,300 అత్యధికంగా 7,900, ఎసి స్పెషల్ వెరైటీ సరాసరి 6,500 కాగా గరిష్ఠ్ధర 7,800 రూపాయలు లభించింది. తాలుగాయలు నాన్ ఎసి రకం సరాసరి క్వింటాల్ 1500 రూపాయలు పలకగా అత్యధికంగా 8000 రూపాయలు పలికింది.
మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా మిర్చి వస్తుండటంతో ధరలు నానాటికీ పడిపోతున్నాయి. తాలుగాయ.. రంగుమారిందనే సాకుతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. దీంతో ధరల్లో వ్యత్యాసం వచ్చి పెట్టుబడులు తిరిగివచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తరలించిన సరకులో 80 శాతానికి పైగా కేవలం 4 వేల నుంచి 5 వేల రూపాయలు మాత్రమే ధర లభిస్తోంది. ఈ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంజన్ల ద్వారా పొలాలకు నీరు పెట్టి పండించుకున్న పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.