రాష్ట్రీయం

ర్యాలీ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ‘నిరుద్యోగ నిరసన ర్యాలీపై వెనకడుగు లేదు. అరెస్టులతో నిరసన ర్యాలీని ఆపలేరు’ అని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ ఆగదని మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఈనెల 1నే నగర పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం అందించానన్నారు. ఇన్ని రోజులు చెప్పకుండా చివరి నిమిషంలో అనుమతి ఇవ్వలేమని చెప్పడం దారుణమన్నారు. ముందే చెప్పివుంటే తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వాళ్ళమని అన్నారు. ర్యాలీకి అనుమతిస్తే తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దూరే ప్రమాదం ఉందని తెరాస నేతలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలో వాస్తవం లేదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారే ఇప్పుడు ఉంటారే తప్ప కొత్త వాళ్ళు లేరన్నారు. టి.జెఎసిపై 31 కేసులు ఉన్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలియజేయడం గురించి ప్రశ్నించగా, తెలంగాణ కోసం కొట్లాడిన కేసులేనని తెలిపారు. తనపైనే కాదు కెసిఆర్‌పైనా కేసులున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ సాధనకు సాగరహారం, మిలినియం మార్చ్ వంటి ఆందోళనలు నిర్వహించినప్పటి కేసులేనని వివరించారు. అరెస్టులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న విషయాన్ని ప్రశ్నించగా, అరెస్టులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదని సమాధానమిచ్చారు. ఇప్పటికే 600 మందిని అరెస్టు చేశారని, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే వారంతా అక్కడే నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంత ఘోరంగా అణచివేతకు నాటి ప్రభుత్వాలు ప్రయత్నించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించామని కోదండరామ్ గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియం, నిజాం కళాశాల మైదానంలో సభలు, సమావేశాలు జరగడం లేదా? అని ప్రశ్నించారు. ఉస్మానియా వర్సిటీలో ర్యాలీ, సభ నిర్వహించుకోవడానికీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పైగా చివరి నిమిషంలో నాగోల్ లేదా మరోచోట నిర్వహించుకోవాలని చెబితే, ఎలా సాధ్యపడుతుందన్నారు. ఆదివారం నిర్వహించుకుంటే తప్పేమిటీ అని కోర్టు ప్రశ్నించిందని, ఆ రోజున వివిధ పోటీ పరీక్షలు ఉన్నాయని, పైగా శివరాత్రి తర్వాత అందరూ అలిసిపోయి ఉంటారు కాబట్టి సాధ్యపడదని చెప్పారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొంటే నేరగాళ్ళుగా చూపించే ప్రయత్నం చేస్తున్నదని, నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని, అప్పాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వాలని తాము అనడం లేదని, నియామకాలకు క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు.