రాష్ట్రీయం

ఉమ్మడి ఆస్తుల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు సమర్పించాయి. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 9, 10 షెడ్యూల్‌లోని ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాలు ఇంతవరకు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో, కేంద్ర హోంశాఖ రంగప్రవేశం చేసింది. వచ్చే నెలలో హోంశాఖ వద్ద రెండు రాష్ట్రాల అధికారులను సమావేశానికి హాజరుకావాలని వర్తమానం పంపారు. 9వ షెడ్యూల్‌లో ఉన్న ఏపిఎస్ ఆర్టీసి, ఏపి ఆగ్రోస్, ఏపి జెన్కో, ఏపి డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపి ఫుడ్స్ సంస్థల విభజనపై వివాదం నెలకొంది. సంస్థల భవనాల విలువ రూ. 3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఏపి, తెలంగాణ జనాభా నిష్పత్తి 58:42 మేరకు ఆస్తుల విభజనకు అంగీకరిస్తామని, కాని ఆస్తుల పంపకం ప్రధాన కార్యాలయాల వరకే పరిమితమని, వాటి అనుబంధంగా ఉన్న భూములు, స్ధలాలు, శిక్షణ సంస్ధలు, ఇతర ఆస్తులకు ఈ సూత్రం వర్తించదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అన్ని ఆస్తులను జనాభా నిష్పత్తి మేరకు విభజించాలన్న ఏపి ప్రతిపాదనకు అంగీకరించమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.
కాగా సుప్రీం కోర్టు గత ఏడాది ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో ఇచ్చిన తీర్పును పాటించాలని ఆంధ్ర కోరుతోంది. ఆస్తుల పంపకానికి జనాభా నిష్పత్తిని సూత్రంగా తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం హైదరాబాద్‌లోని 17 ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను ఏపి ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. ఆర్టీసి, ఆగ్రోస్, ఫుడ్స్, ఏపిఐడిసి, ఏపిడిడిసి, వుమెన్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్, హౌసింగ్ కార్పోరేషన్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, పర్యాటక అభివృద్ధి సంస్ధ, వికలాంగుల సంస్ధ, క్రీడాభివృద్ధి సంస్ధ, ట్రాన్స్‌కో, జెన్కో, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధ, ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధ, ఏపి ఫిల్మ్, టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్ సంస్ధ వివరాలను కేంద్రానికి ఏపి ఇచ్చింది. 9వ షెడ్యూల్‌లో మొత్తం 91 సంస్థలున్నాయి. కేంద్రం నియమించిన షీలా బేడీ కమిటీ ఇంతవరకు 61 సంస్థల విభజనను పూర్తి చేసింది. కాని ఉద్యోగుల పంపకాన్ని పూర్తి చేయలేదు. ఈ కమిటీ కాలపరిమితి రెండు సార్లు పొడిగించగా, జనవరితో ముగిసింది. మూడోసారి పొడిగించాలని ఏపి కేంద్రాన్ని కోరింది.