రాష్ట్రీయం

ఊరు విడిచి వనానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 21: సాంకేతికతను వినియోగించుకుని ప్రపంచాన్ని జయిస్తున్న రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాలు ప్రజల వెన్నంటే ఉన్నాయి. ఆధునిక సాంకేతికత పెరుగుతున్న స్థాయిలోనే మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామానికి కీడు వచ్చిందంటూ అందరూ కలిసి ఊరు విడిచి వనానికి తరలారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామ శివారులోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గత మంగళవారం ఒక మహిళ చనిపోయింది. అనంతరం వరుసగా మరో ఐదుగురు వివిధ కారణాలతో మరణించారు. గడిచిన రెండు నెలల్లో 20 మంది వరకు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం స్థానిక పూజారితో పాటు కొందరు పెద్దలకు వివరించారు. వారంతా కలిసి పూజారులు, సిద్ధాంతులతో చర్చించారు. గ్రామానికి కీడు వచ్చిందని, శాంతి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గ్రామంలోని ఏ ఇంటిలో దీపం వెలగకూడదని, పొయ్యి వెలగకూడదని, అందరూ వనానికి వెళ్ళి అక్కడే వండుకుని ఉండాలని సూచించారు. చెప్పిందే తడవుగా గ్రామస్థులంతా సామూహికంగా మంగళవారం గ్రామాన్ని వదిలి సమీపంలోని మామిడి తోటకు వెళ్ళారు. అక్కడే వండుకు తిని సూర్యాస్తమయం అయిన తర్వాత గ్రామానికి చేరారు. తమ గ్రామానికి కీడు జరిగిందని, అందుకు గ్రామంలో ఒకరొకరుగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మూఢ నమ్మకాలను పారదోలేందుకు గతంలో అనేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఈ తరహా కార్యక్రమం జరగడం ఇదే ప్రథమం. అయితే దీనిపై హేతువాద సంఘాల నేతలు మాత్రం ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని, వారిలో లేని భయాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆ గ్రామానికి వెళ్ళి వారిలో అవగాహన కల్పిస్తామన్నారు.

తోటలో వంటావార్పు చేసుకుంటున్న దృశ్యం