ఆంధ్రప్రదేశ్‌

భారీ పెట్టుబడులే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి 14500 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులను సాధించే దిశగా తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ముంబైలో ఫ్యూచర్ డీకోడెడ్ పేరుతో జరుగుతున్న సదస్సులో బుధవారం ఆయన ప్రసంగించారు. దేశంలో తొలి డిజిటల్ నగరంగా విశాఖ ఆవిష్కృతం కానుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల, ఎస్ బ్యాంక్ చైర్మన్ రానా కపూర్‌తో చంద్రబాబు విడిగా భేటీ అయ్యారు. అంతే కాదు వీసా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఓ అవగాహనా ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. సదస్సులో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లుగా ఉందని, 2029 నాటికి దీనిని 946 బిలియన్ డాలర్లకు తీసుకువేళ్లేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత తలసరి ఆదాయం 179 డాలర్లుగా ఉందని, 16017 డాలర్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వృద్ధిరేటు 15శాతం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని ఆయన వివరించారు. 2022నాటికి దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేలా ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు.
హ్యాపీనెస్ ఇండెక్స్‌లో కూడా మొదటి స్థానంలో రాష్ట్రాన్ని ఉంచేందుకు నిర్ణయించామన్నారు. వృద్ధిరేటు సాధనకు పెట్టుబడులు కూడా అవసరమని, 120నుంచి 145బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆశిస్తున్నామన్నారు. ఉపాధి, ఇంటర్నెట్ నాలెడ్జి, గృహ, నీరు, పశుదాణ భద్రత వంటివి కల్పిస్తున్నామన్నారు. వౌలిక సదుపాయాలు, రోడ్లు, పరిశ్రమలు తదితర అంశాలపై దృష్టి సారించామన్నారు. డిజిటలైజేషన్‌కు సంబంధించి ముఖ్యమంత్రుల కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని, ఇప్పటికే మధ్యంతర నివేదిక అందచేశామని, త్వరలో పూర్తి స్థాయి నివేదిక అందచేస్తామన్నారు. విశాఖను తొలి డిజిటల్ నగరంగా ఆవిష్కరించేందుకు నాంది పలుకుతున్నామన్నారు. సాంకేతికను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రియల్ టైమ్ గవర్నెన్సులో కైజాలా యాప్ కీలక పాత్ర వహిస్తోందని, రాష్ట్రంలో 62 వేల మంది పోలీస్ అధికారులు దీన్ని ఉపయోగించి క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని తెలుసుకుంటున్నారని వివరించారు. 14.4 మిలియన్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, మరో సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహణలో కీలకమైన క్లౌడ్-్ఫస్ట్ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకు వచ్చారు. రాష్ట్రంలో నైపుణ్యాల ఉపాధి కల్పనపై సత్య నాదెళ్లతో సిఎం చర్చించారు. రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్సులో మైక్రోసాఫ్ట్‌తో కలిసి ప్రయోగం చేయబోతున్నామని తెలిపారు. రాజధాని అమరావతిలో ఫిన్‌టెక్ పార్క్ ఏర్పాటుపై సిఎంతో ఎస్ బ్యాంక్ చైర్మన్ రానా కపూర్ చర్చించారు. పర్యాటకం తదితర అంశాలపై కూడా చర్చించారు. వీసా సంస్థ సిఇఒ ఎఫ్.కెల్లీతో సిఎం చర్చించారు. వీసా సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
చైనా బృందాన్ని కలిసిన సిఎం
విజయవాడలో చైనాకు చెందిన సిచువాన్ ప్రోవిన్సియల్ పీపుల్స్ గవర్నమెంట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.
చిత్రం... ముంబయలో మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు