ఆంధ్రప్రదేశ్‌

థర్మల్ పవర్‌కు చెల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: పర్యావరణ పరిరక్షణతోపాటు విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గింపుకోసం ఇక సౌర, పవన్ విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తామని ఎపి ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. దశల వారీగా ప్రస్తుతం పనిచేస్తున్న థర్మల్ పవర్ స్టేషన్లను మూసివేయటం జరుగుతుందన్నారు. బొగ్గ్ధుర అనూహ్యంగా పెరగడం కూడా దీనికి కారణమని చెప్పారు. 2015-16 సంవత్సరంలో 44,080 మిలియన్ యూనిట్‌ల విద్యుత్ ఉత్పత్తి కాగా అందులో సౌర, పవన విద్యుత్ 4 శాతం ఉందని, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం అదనంగా 48,665 మిలియన్ యూనిట్‌ల విద్యుత్ ఉత్పత్తి కాగా అందులో సౌర, పవన విద్యుత్ 9 శాతంగా ఉందన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని ఈ ఏడాది 15 శాతానికి పెంచనున్నామన్నారు. బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అజయ్‌జైన్ మాట్లాడారు. రోజూ 160 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరగనున్నప్పటికీ ఎక్కడా ఎలాంటి కోత లేకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌కు ఈ నెల 23 నుంచి మార్చి రెండవ తేదీ వరకు కమిటీలు వేస్తామని, వీటిలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు సభ్యులుగా ఉంటారని అన్నారు. మీటర్లు లేకుండా విద్యుత్ చౌర్యం చేసే వినియోగదారులను ఈ కమిటీలు గుర్తించి చర్యలు చేపడతాయన్నారు. లైన్‌లాస్ కూడా లేకుండా చూస్తారన్నారు. 2014 నుంచి అందచేసిన ఎల్‌ఇడి బల్బులలో కొన్ని నాసిరకంవి ఉండటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ, మండల కేంద్రాల్లో వాటి స్థానంలో నాణ్యమైన బల్బులు అందజేస్తామన్నారు. విద్యుత్ బకాయిలు గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వ శాఖలు రూ. 1800ల నుండి రెండు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంటే ఒక్క నీటిపారుదల శాఖే రూ. 500కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. పట్టిసీమ, హంద్రీనీవా తదితర ప్రాజెక్ట్‌లు విద్యుత్‌ను అధికంగా వినియోగించాయన్నారు. ఈ సమావేశంలో ఎపిఇపిడిసిఎల్ సిఎండి ఎంఎం నాయక్, ఇంధన శాఖ సిఇవో ఎం చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... బుధవారం విలేఖరులతో మాట్లాడుతున్న
ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్