ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైల మల్లన్నకు పుష్పపల్లకి సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 22: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ నిర్వహించారు. ఉదయం జపాలు, మండపారాధనలు, రుద్ర, చండీ హోమాలు, చండీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. మహామంగళ హారతి అనంతరం పుష్పపల్లకి సేవ నిర్వహించారు. ఇందుకోసం 11 రకాల పూలను వినియోగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పుష్పపల్లకి సేవను చూసి తరించారు. ఉత్సవం ముందుభాగంలో భక్తులు ప్రదర్శించిన కోలాటాలు, డప్పువాయిద్యాలు, మేళతాళాలు, పగటి వేషాలు, గొరవయ్య నృత్యాలు, లంబాడీ నృత్యాలు, పగటి వేషాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాత్రి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి న్యత్యం, వేణుగానం, సంగీత విభావరి అలరించాయి.