రాష్ట్రీయం

ఎఎల్‌ఎస్ అంబులెన్సులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఎఎల్‌ఎస్) అంబులెన్సుల్లో టెలిమెడిసిన్ సౌకర్యం అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఎఎల్‌ఎస్ అంబులెన్స్‌లను లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఈ తరహా అంబులెన్సులను రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. 13 జిల్లాలకు సంబంధించి 76 ఎఎల్‌ఎస్ అంబులెన్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఐదు లక్షల జనాభాకు ఈ ఆధునిక అంబులెన్సు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక్కో అంబులెన్సును 32 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేశామని, ఇందులో 38 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు తన ఎంపి లాడ్స్ నిధుల నుంచి అదనంగా మరో 13 ఎఎల్‌ఎస్ అంబులెన్సులను కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారన్నారు. దీనిలో టెలిమెడిసిన్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీని ద్వారా రోగికి అంబులెన్సులోనే వైద్యం అందే వీలు కలుగుతుందన్నారు.

చిత్రం..గురువారం ఎఎల్‌ఎస్ అంబులెన్సును ప్రారంభించి
లోపల పరికరాలు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు