రాష్ట్రీయం

సేద్యంతో వృద్ధిరేటుకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: సమర్థ నీటి నిర్వహణతో పంటల క్రమాన్ని కాపాడి అధిక దిగుబడులను సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ శాఖాధిపతులతో గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దాదాపు 9 గంటల సేపు వివిధ శాఖల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల విజయాలు, ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లను ఇచ్చారు. వ్యవసాయ రంగం సమీక్ష సందర్భంగా సిఎం మాట్లాడుతూ వ్యవసాయం రంగం 25 శాతం వృద్ధిరేటు సాధన, అనుబంధంగా ఉన్న పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య రంగాలు 30 శాతం వృద్ధిరేటు సాధించాలని ఆయన ఆదేశించారు. ఆహార భద్రతకు, పోషకాహార భద్రతకు మత్స్యరంగం ఇతోధికంగా తోడ్పడాలన్నారు. క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు వాడనటువంటి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పంట రక్షక చర్యలతో అన్ని పంటల దిగుబడి స్థాయిలను పెంచేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదన చేసింది. ఇందుకోసం జలవనరులశాఖ, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమ్మిళితంగా, సమర్ధంగా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వ్యవసాయదారుల్లో వ్యవసాయ యాంత్రీకరణపై చైతన్యం తేవాలని, పట్టిసీమ ప్రాజెక్టు నీటితో మూడో పంట కింద ఆయకట్టును ఖరారు చేయాలని, కృష్ణాడెల్టాలో పశుగ్రాసం పండించాలని, నవధాన్య పథకం కింద వ్యవసాయ క్షేత్రాల్లో మిశ్రమ పంటల విధానాలకు ప్రోత్సాహం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో వేరుశనగ పంట వర్షాభావంతో ఎండిపోతున్న తరుణంలో రెయిన్‌గన్స్ ద్వారా పంటలను కాపాడగలిగామని, అయితే ముందుగా అప్రమత్తమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
‘పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలలో నవంబర్, డిసెంబర్ తర్వాత నీరు తగ్గుతుందని, ముందుచూపుతో, ప్రణాళికతో వెళితే రెండో పంటకు నీరివ్వటం కష్టం కాదని ముఖ్యమంత్రి అన్నారు. మత్స్య, ఉద్యానవన, సెరికల్చర్ రంగాల్లో ఇంకా దాదాపు రూ.200 కోట్ల నిధులు వ్యయం చేయాల్సి ఉందన్నారు.
వ్యవసాయ రంగంపై ఆ శాఖ కార్యదర్శి రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ ప్రాంతాల వారీగా పంటలు వేస్తున్నప్పుడు అధిక దిగుబడుల వ్యూహాలను అందుకు అనుగుణంగా రూపొందించుకోవాలన్నారు. వ్యసాయ శాఖ కమిషనర్ ధనంజయరెడ్డి కేంద్ర సహాయంతో అమలు జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి పథకాలను వివరించారు.
అంతర్జాతీయంగా ఉద్యాన పంటల మార్కెట్ ధోరణులను గమనించి అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉద్యాన పంటలపై ఆ శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ వ్యవసాయం ఉద్యాన పంటల వల్లనే లాభసాటిగా మారుతుందన్నారు.
పశుగణాభివృద్ధి శాఖ ప్రజెంటేషన్ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 2020 నాటికి పాడి పరిశ్రమలో రాష్ట్రం దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని కోరారు.
లబ్దిదార్ల ఎంపిక ఆధార్ సీడింగ్‌తో జరగాలని, పథకాల వర్తింపు, అమలులో కాల్ సెంటర్ నుంచి లబ్దిదారులకు సమాచారం వెళ్లాలని, ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం చేయాలని, తప్పుడు సమాచారం వచ్చినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, సంక్షేమ శాఖకు సంబంధించి కార్యదర్శి రావత్, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్, రెవెన్యూ శాఖపై సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునేఠా, ఐటిఇసిపై కార్యదర్శి విజయానంద్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు.