రాష్ట్రీయం

బిల్లులకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకూ ట్రెజరీల్లో నిలిచిపోయిన అన్ని రకాల బిల్లులను తక్షణం చెల్లింపులు జరపాలంటూ ఖజానాలు, లెక్కల విభాగం డైరెక్టరేట్ నుంచి గురువారం రాత్రి అధికారులకు వౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం శివరాత్రి, ఆపై శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు కావటంతో సోమవారం నుండే చెల్లింపులు ప్రారంభమవుతాయి. అంటే 20 రోజుల తరువాత తిరిగి చెల్లింపులు ప్రారంభమైనట్లు భావించా ల్సి ఉంది. ఆర్థిక సంక్షోభం కారణంగా అకస్మాత్తుగా ఈనెల 8వ తేదీనుంచి అన్ని రకాల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కొద్దిరోజుల క్రితం తొలిదశలో జ్యుడిషియల్, రెండో దశలో ఎయిడెడ్, అంగన్‌వాడీ టీచర్స్, హాస్టల్ విద్యార్థుల ట్యూషన్ బిల్లులు, మూడోదశలో గ్రామ విఆర్‌ఏలు, కాంట్రాక్టు ఔట్‌సోర్స్ ఉద్యోగుల బిల్లులకు అనుమతి లభించింది. తాజాగా అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.