రాష్ట్రీయం

కొత్త చట్టాలు పట్టాలెక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్‌లో జ్యుడీషియల్ అకాడమి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. కొత్త నేరాల నేపథ్యంలో కొత్త చట్టాలు రావాల్సిన అవసరముందన్నారు. ఈడీబి, జపాన్ విదేశీ వాణిజ్య సంస్ధ (జెట్రో) ఆధ్వర్యాన ‘మేధాహక్కులు.. వాణిజ్య, ఇంధన చట్టాలు’ అంశంపై విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రక సంపద, సంస్కృతి ఉందన్నారు. విభజనకు ముందు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో సవాళ్ళు వచ్చాయని, వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కుంటోందన్నారు. నేరాలు కొత్త రూపాలు మార్చుకుంటున్న క్రమంలో చట్టాలు కూడా కొత్తగా రూపకల్పన చేయాలని, సైబర్ క్రైం నివారణకు ఐటి చట్టాలు పటిష్ఠంగా ఉండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాళ్ళను అవకాశాలుగా మార్చుకుంటోందని ప్రశంసించారు.
సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్ స్థానంలో ఉందని సుప్రీంకోర్టు జస్టిస్ మదన్ బి లోకూర్ అన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సవాళ్ళు, వాటితోపాటు అవకాశాలూ ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు డైనమిక్, విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారని చంద్రబాబును ప్రశంసించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపి ముందుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కోర్టుల్లోనూ వాణిజ్య కోర్టులు ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు.
మేధాహక్కులకు ప్రత్యేక చట్టాలు : జస్టిస్ రంగనాథన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ ఆర్థిక అంశాలతో ముడిపడిన మేధోసంపత్తి హక్కులకు ప్రత్యేక చట్టాలు ఉండాల్సిందేన్నారు. మన దేశంలో 1856లో తొలి పేటెంట్ దరఖాస్తు నమోదైందని, పంఖా పుల్లింగ్ మిషన్ కోసం దరఖాస్తు వచ్చిందన్నారు.
వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తాం : సిఎం
రాష్ట్రంలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. న్యాయ సదస్సులో ఆయన పాల్గొని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో రాజధాని అమరావతితోపాటు విశాఖ, తిరుపతిలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో మోడల్ జస్టిస్ సిటీ నిర్మాణం చేపట్టనున్నామని సీఎం తెలిపారు. ప్రపంచంలోని ఐదు గొప్ప నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వేల సంవత్సరాల నుంచి అమరావతికి, బుద్ధిజానికి అవినాభావ సంబంధం ఉందని, ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు బుద్ధిజం వ్యాప్తి చెందిందని సిఎం చెప్పారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు 17 ప్రధాన లక్ష్యాలు పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. కుటుంబ వికాసం కోసం ప్రభుత్వం తమ వంతుగా హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టి తోడ్పాటును అందిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్ 13 శాతం అభివృద్ధి సాధించిందని, హార్టికల్చర్ 25 నుంచి 30 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఎకో సిస్టం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు 4వ సాంకేతిక విప్లవం నడుస్తుందని, దీని ప్రధాన ఉద్దేశం సాంకేతికతతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా భాగమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న ఫైబర్‌నెట్ వల్ల రాష్ట్రంలో సాంకేతిక విప్లవం చోటుచేసుకోబోతుందని తెలిపారు. వర్క్‌షాప్‌కు హాజరైన న్యాయకోవిదులకు సిఎం డ్యాష్‌బోర్డు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచిన వర్షపాతం వివరాలు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భూగర్భ నీటి మట్టాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా వీడియో ద్వారా చూపించారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా ఆంధ్రప్రదేశ్‌ని టచ్ చేయకుండా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. లాజిస్టిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తుందన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వర్క్‌షాపులో పాల్గొన్న న్యాయమూర్తుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
కొత్త చట్టాలు రావాలి :జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా కొత్త చట్టాలు రావాలన్నారు. సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల సంక్లిష్టమైన వివాదాలు ఉత్పన్నమవుతాయని, మరిన్ని వాణిజ్య కోర్టులు రావాలని అభిప్రాయం వ్యక్తం

చిత్రం..అంతర్జాతీయ వర్క్‌షాప్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు