రాష్ట్రీయం

ఇపిఎఫ్‌లో ఇంటిదొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 24: కడప నగరంలోని ప్రాంతీయ ఎంప్లారుూస్ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) కార్యాలయంలో భారీ కుంభకోణం జరిగింది. కొంతమంది అధికారులు, సిబ్బంది కలిసి రూ.కోటి 64 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. పెన్షన్‌దారుల ఖాతాల్లో సొమ్ము జమచేయకుండా ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. ఓ పెన్షన్‌దారుడి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు కూపీ లాగడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో అక్రమాలకు పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదుచేశారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఇపిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం కడపలో ఉంది. సీమ జిల్లాల్లోని పలు ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలనుంచి కట్ చేసిన పిఎఫ్, సంబంధిత కంపెనీలు చెల్లించే సొమ్ము ఈ కార్యాలయంలో జమ అవుతోంది. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం లేదా ఉద్యోగి మరణిస్తే అతని కుటుం బ సభ్యులకు పెన్షన్ అందజేస్తారు. గత ఏడాది మే 5న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ననే్నబి తన భర్త మరణానంతరం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెన్షన్ డబ్బు కోసం కార్యాలయం చుట్టూ కాలికి బలపం కట్టుకుని
తిరుగుతున్నా పెన్షన్ మాత్రం అందడం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కలిసి ప్రతినెలా ఆమెకు పెన్షన్ పంపుతున్నట్లు రికార్డుల్లో నమోదుచేసి ఇతర ఖాతాలకు మళ్లిస్తున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగుల ప్రమేయంతో ఇది జరిగి ఉండవచ్చునని వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి ఈపిఎఫ్ ఆఫీస్‌లో రూ.9 లక్షలు స్వాహా జరిగినట్లు తేల్చారు. అయితే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.
ఆ తరువాత తాడిపత్రి మహిళ తరహాలోనే వందలమంది తమకు పెన్షన్ అందడం లేదని ఈపిఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులనుంచి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో చేసేదిలేక సిబిఐని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 230 మందికిపైగా పెన్షనర్లకు సంబంధించిన నగదు చెల్లించలేదని సిబిఐ విచారణలో తేలింది. ఈ సొమ్ము కడప ఈపిఎఫ్ ఆఫీసులోని అధికారులు, సిబ్బంది స్వాహా చేసినట్లు నిర్ధారణకు వచ్చి తదుపరి విచారణ ప్రారంభించారు. గతంలో కడప ఈపిఎఫ్ కార్యాలయంలో పనిచేసిన కొండపల్లి సత్యనారాయణ పెన్షన్‌దారుల సొమ్ము తన కుటుంబ సభ్యుల పేర ఉన్న ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈ విచారణలో తేలింది. నెల్లూరు జిల్లా దర్గామిట్ట ఆంధ్రాబ్యాంకు శాఖలో సత్యనారాయణ కుమారుడు కొండపల్లి సత్యకృష్ణ, ఇతర కుటుంబసభ్యులు ఏడుగురి ఖాతాల్లో ఈ సొమ్ము జమచేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. దీనికి సంబంధించి ఆంధ్రాబ్యాంకు అధికారి మధుమతి ప్రమేయం కూడా ఉన్నట్లు సిబిఐ అధికారులు భావిస్తున్నారు. దీంతో గతంలో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును సిబిఐ అధికారులు తిరగదోడి దర్యాప్తు ముమ్మరం చేశారు. సత్యనారాయణ సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత కమిషనర్ నాయక్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సిబిఐ అధికారులకు సహకరిస్తున్నారు. కడప ఈపిఎఫ్ కార్యాలయం లావాదేవీల కంప్యూటర్ హార్డ్‌కాపీలు సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

చిత్రం..కడపలోని ఇపిఎఫ్ కార్యాలయం