రాష్ట్రీయం

వాళ్ల బుద్ధే అంత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 24: దేవుళ్లకు కానుకల సమర్పణపై సైతం కొందరు సన్యాసులు మాట్లాడుతున్నారని, దీనిపై తానేమి మాట్లాడదలుచుకోలేదని ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో కాలం చెల్లిన కమ్యూనిస్టులు కూడా తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. 40 సంవత్సరాలకు పైబడి అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టుడే ధ్యేయంగా పోతున్నారు తప్ప అభివృద్ధికి సహకరించడంలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జనగామ నియోజకవర్గ పరిధిలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద కనీసం రెండు లక్షలు కూడా చెల్లించలేదని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ మంత్రులు సీమాంధ్ర నాయకులకు బానిసలుగా పనిచేశారని అన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని శ్రీవీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి బంగారు మీసాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వగ్రామమైన చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లితండాకు చేరుకున్నారు. అక్కడ భోజన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలనే ఉద్దేశ్యంతోనే యాదవులకు 4వేల కోట్ల ప్రాజెక్ట్‌తో 75శాతం సబ్సిడీతో 88లక్షల గొర్రెల పంపిణీకి శ్రీకారం చేపట్టామన్నారు. అలాగే మత్స్యకారులు, ఇతర కులవృత్తుల వారి సంక్షేమం కోసం కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 64 లక్షల మంది సంచార జాతుల వారున్నారని, వారందరికి త్వరలోనే ఎంబిసి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పని విధానంతో ప్రతిపక్షాలకు మింగుడుపడడంలేదని, వారి పీఠాలు కదులుతాయనే ఆందోళన పుట్టుకొస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 36వేల కోట్ల ఖర్చుతో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నీరందించే యజ్ఞాన్ని ప్రారంభించిందని, ఉభయ గోదావరి డెల్టాను తలదనే్న విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగు, సాగునీరు అందించబోతున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్ట్‌లను ఆపే కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులపై స్టే తీసుకువస్తున్నారంటూ సిఎం తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజలకు చేసే మేలు ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాబోయే ఆసెంబ్లీసమావేశాల్లో ఎండగడుతామన్నారు.
త్వరలోనే వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తి అయిందని, టెక్స్‌టైల్ హబ్‌పై అధ్యయనం చేసేందుకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్‌కమిటీ సూరత్, తిరుపూర్, సోలాపూర్ వెళ్లివచ్చిందన్నారు.

చిత్రం..కురవి వీరన్న స్వామి మొక్కు చెల్లించేందుకు శుక్రవారం బంగారు కోరమీసాలను నెత్తిన పెట్టుకుని మంత్రులతో కలిసి దేవాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.