రాష్ట్రీయం

పుణ్య స్నానాల్లో 11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: శివరాత్రి పర్వదినాన రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రి రోజున చోటు చేసుకున్న ప్రమాదాలతో ఆయా కుటుంబాల్ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ సమీపంలోని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వీరిలో నలుగురు యువకులు ఈత కొడుతూ ఇసుకలో చిక్కుకుపోయారు. నీటి ప్రవాహాం అధికంగా ఉండటంతో ఒడ్డుకురాలేక కొట్టుకుపోయారు. మంచిర్యాల పట్టణంలోని జాఫర్ నగర్‌కు చెందిన శ్రీకాంత్ (28), రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన చిట్ల చంద్రవౌళి, ఆనందపు సాయికుమార్, మంచిర్యాలకు చెందిన పోతుల సుధాకర్ గల్లంతయ్యారు. వీరిలో శ్రీకాంత్ మృతదేహం లభ్యం కాగా, మిగతా ముగ్గురు యువకుల ఆచూకీ లభించలేదు. మృతదేహాల కోసం గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు. నీటిలో కొట్టుకుని పోతున్న చంద్రవౌళిని కాపాడేందుకు
స్థానికులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రవాహ ఉధృతి కారణంగా కాపాడలేకపోయినట్లు చెబుతున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లాలోని చింతల బయ్యారం వద్ద గోదావరిలో నలుగురు యువకులు మృతి చెందారు. మృత చెందిన నలుగురూ 22ఏళ్ల వయసువారేనని, వీరిని ఎ. నాగేంద్ర బాబు, భువనగిరి పవన్, తాంత్రపల్లి మురళి, గుడే ప్రేమ్ కుమార్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగర శివారులోని శామీర్‌పేట పెద్ద చెరువులో ఈతకు వెళ్ళిన ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. వారిరువురు మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన విష్ణు, సాయిరామ్‌గా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఖానాపూర్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో స్నానానికి వెళ్లిన గజ్రాల అశ్వీత్ (13) నీటి మునిగి మరణించాడు.