రాష్ట్రీయం

సింగిల్ పర్మిట్ ఒప్పందంపై తెగని వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మరో నాలుగు నెలల్లో మూడేళ్లు కావస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా శాఖలో సింగిల్ పర్మిట్‌పై ఒప్పందం ఖరారు కాలేదు. దీంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వాహన యజమానులు రెండు రాష్ట్రాల రవాణాశాఖలకు పర్మిట్ల ఫీజును చెల్లించాల్సి వస్తోంది. సింగిల్ పర్మిట్‌లపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే, రెండు రాష్ట్రాల వాహన యాజమానులు సాలీనా రూ.5వేల ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. కాని ఇప్పుడు ఒక్కో వాహనానాకి సాలీనా రూ.60 వేల ఫీజును చెల్లిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు రెండు రాష్ట్రాల రవాణా శాఖాధికారుల మధ్య చర్చలు జరిగినా సింగిల్ పర్మిట్‌పై ఒప్పందం ఖరారు కాలేదని, దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని తెలంగాణ లారీ ఓనర్ల సంఘం ప్రతినిధి జి దుర్గా ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కర్నాటక, మహారాష్టల్రతో సింగిల్ పర్మిట్‌పై ఒప్పందం కుదుర్చుకుంది. సింగిల్ పర్మిట్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లారీ ఓనర్ల సంఘం గత అక్టోబర్‌లో సమ్మె కూడా చేశారు. ప్రస్తుతం తెలంగాణలో నాలుగు లక్షల లారీలు, ఆంధ్రాలో ఐదు లక్షల లారీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య వివిధ చెక్‌పోస్టుల ద్వారా రోజుకు 50 వేల లారీలు తిరుగుతున్నాయి.