రాష్ట్రీయం

వలస చట్టాలు మనకేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 25:ప్రపంచంలో పేరెన్నిక గల దేశాల్లో కంటే ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)లో భారతదేశమే కంపెనీలకు, వ్యక్తులకు అనుకూలంగా ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంలో ‘ఆర్బిట్రేటర్’ గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారన్నారు. వలస చట్టాల మీద ఆధారపడే కన్నా భారతదేశానికి చట్టాల విషయంలో స్వీయ విధానం రూపొందించుకోవలసిన అవసరముందన్నారు. జపాన్ ఎక్సటర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపి ఇడిబి) ఆధ్వర్యాన మేధాసంపత్తి, వాణిజ్య అనువర్తిత చట్టాలపై విజయవాడలో జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సు చివరిరోజు శనివారం జరిగిన వర్క్‌షాపులో జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ సింగపూర్ వంటి దేశాల కన్నా భారతదేశమే ఆర్బిటేషన్ విధానానికి అనుకూలమన్నారు. సివిల్ కేసుల పరిష్కారంలో ఆర్బిట్రేటర్ ముఖ్యపాత్ర వహిస్తున్నారన్నారు. వలస చట్టాలకు సంబంధించి, కంపెనీల అగ్రిమెంట్లకు సంబంధించి సింగపూర్ వంటి దేశంలో రోజుకు ఒక్కో కేసుకు లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారన్నారు. భారతదేశంలో ఆర్బిట్రేటర్లు తక్కువ ఖర్చుతోనే కేసుల పరిష్కారంలో సేవలు అందిస్తున్నారని చెప్పారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిఙ్ఞనాన్ని అమల్లోకి తేవడం కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ‘వివాహ చట్టాలు, బాలల హక్కులు’ అంశంపై ప్రసంగించారు. మారుతున్న కాలంలో ఎన్‌ఆర్‌ఐ, సహజీవనం, సరోగసి, దత్తతలపై వస్తున్న కేసుల గూర్చి వివరించారు. ఈ తరహా కేసులు మన దేశంలో కూడా అంతకంతకు పెరుగుతున్నాయన్నారు. జువనైల్ యాక్టు 41 గూర్చి వివరిస్తూ చిన్నపిల్లల కేసులను పరిష్కరించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. రాష్ట్రాల మధ్య దత్తత విషయంలో కేసులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయంగా సరోగసిపై ఉన్న చట్టాలను, ప్రతిబంధకాలను వివరించారు. కోడిఫైడ్ లా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌వి రవీంద్ర మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు న్యాయవాదులు, న్యాయాధికారులు తమ వంతు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఆర్బిట్రేషన్ యాక్టుకు సంబంధించి వివిధ సెక్షన్లను వివరిస్తూ భారతదేశం భవిష్యత్తులో ఆర్బిట్రేషన్ హబ్‌గా ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ విశిష్టతను ఈ సందర్భంగా కొనియాడారు. ‘న్యూ డైమెన్షన్స్ ఇన్ ప్రాపర్టీ లా’ అంశంపై ఏపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి వివిఎస్ రావు మాట్లాడుతూ భారతదేశ పౌరులు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించి ఉన్న ఆస్తుల వివాదాలను వివరించారు. దేశంలో గోలక్‌నాథ్, కేశవానంద భారతీ కేసులకు సంబంధించి ఉన్న ఫండమెంటల్ రైట్స్‌పై వచ్చిన తీర్పులను వివరించారు.

చిత్రం..అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రసంగిస్తున్న జస్టిస్ మదన్ బి లోకూర్