రాష్ట్రీయం

సింగపూర్‌కే స్విస్ ఛాలెంజ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 25: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం సింగపూర్‌తోనే ముడిపడనుంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై హైకోర్టులో వ్యాజ్యాల అనంతరం రెండోసారి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ, పోటీ టెండర్లు దాఖలు కాలేదు. కౌంటర్ ఛాలెంజ్ టెండర్ల దాఖలుకు గడువు ఈ నెల 21తో ముగియగా, సింగపూర్ సంస్థలకు పోటీగా ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అమరావతి నగరంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది టెండర్లను ఆహ్వానించింది. స్విస్‌ఛాలెంజ్ కింద సింగపూర్ సంస్థలు కొన్ని ప్రతిపాదనలు చేశాయి. ఇందుకు 1691 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పగిస్తుంది. స్విస్‌ఛాలెంజ్ కింద ఎంపికైన సంస్థలకు అభివృద్ధి అనంతరం వచ్చే ఆదాయంలో 52 శాతం, ప్రభుత్వపరంగా అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీకి 48 శాతం వాటాగా నిర్ణయించారు. సింగపూర్ సంస్థలు ఒపిపి (ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోనెంట్‌గా) గత ఏడాది మార్చి 12న దాఖలు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా 305 కోట్లు కాంట్రాక్టు సంస్థలు, మరో 220 కోట్లు అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ (ఎడిఎ) పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఎడిఎకు ప్రభుత్వం నిధులు సమకూర్చుతుంది. ప్రతిపాదిత 1691 ఎకరాల వెలుపల రాజధాని నగర వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రోడ్లు,విద్యుత్, డ్రెయినేజి, ఇతర సదుపాయాలను రూ. 5వేల కోట్లతో చేపట్టేందుకు కోర్ కేపిటల్ డెవలప్‌మెంట్ మేనేజిమెంట్ కమిటీ (సిసిడిఎంసి)కి అధికారాలు కల్పించారు. అయితే ఇదంతా ఏకపక్షంగా, గోప్యంగా జరుగుతోందని ఆరోపిస్తూ ఆదిత్య ఇన్‌ఫ్రా హౌసింగ్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బహిరంగ టెండర్లను ఆహ్వానించాలని కోర్టును అభ్యర్థించింది. కోర్టు అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌పై అప్పట్లో యు టర్న్ తీసుకుంది. ఏపిఐడిఇ యాక్టు -2001 (ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ యాక్టు)తో పాటు 170 జీవోలో సవరణలు తీసుకొచ్చి మరోసారి స్విస్‌ఛాలెంజి పద్దతిన రాజధాని నగర అభివృద్ధికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్‌లకు ఇ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా రాజధాని ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) మార్గనిర్దేశకాలు జారీచేసింది. ఏపిఐడిఇ చట్టంలోని 9-1(ఎ) ప్రకారం ప్రభుత్వపరంగా హైపవర్ కమిటీ పర్యవేక్షణలో ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోనెంట్‌తో బిజినెస్ ప్లాన్, కనె్సషన్ అగ్రిమెంట్ అండ్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (సిఎడిఎ), షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్ (ఎస్‌హెచ్‌ఎ) కుదుర్చుకోవాల్సి ఉంది. సెక్షన్ 9(6) ప్రకారం స్విస్‌ఛాలెంజ్ పద్ధతిలో భాగంగా కౌంటర్ ఛాలెంజ్ ప్రతిపాదనలు స్వీకరించాలి. సెక్షన్ 9(8)ని ప్రభుత్వం తొలగించటంతో సెక్షన్ 9(9) ప్రకారం బిడ్డింగ్ ప్రక్రియకు అనుగుణంగా ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఇందులో భాగంగా టెక్నికల్, ఫైనాన్స్ బిడ్‌లకు గత ఏడాది సెప్టెంబర్ 2016న మరోవిడత టెండర్లను ఆహ్వానించారు. అయితే ఈ నెల 21వ తేదీతో గడువు ముగిసినా, కౌంటర్ ఛాలెంజ్ టెండర్లు దాఖలు కాలేదు. దీనిపై సిఆర్‌డిఎ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పోటీ బిడ్‌లు దాఖలు కాకపోవటంతో సింగపూర్ సంస్థలు అసెండాస్- సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ సంస్థలకే రాజధాని అభివృద్ధి పనులు అప్పగిస్తుందా..లేక మళ్లీ తలనొప్పులు ఎదురవుతాయనే భావనతో తిరిగి గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తుందా అనేది తేలాల్సి ఉంది.