రాష్ట్రీయం

నరుూం అనుచరుడు నగేశ్‌కు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరుడు కుంట్ల యాదగిరి (45) అలియాస్ నగేష్, అలియాస్ భీమ్‌రెడ్డి అలియాస్ క్రాంతి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన నగేష్ టిఆర్‌ఎస్ నేత, మాజీ మావోయిస్టు కోనపురి రాములు, పోచయ్య, జడల నాగరాజు హత్య కేసుల్లో నిందితుడు. నగేష్‌పై బెరింపులు, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర 45 కేసులు నమోదయ్యాయి. గతంలో మావోయిస్టు పార్టీలో ఉన్న నగేష్ దుబ్బాక దళ కమాండర్‌గా పని చేశాడు. అజ్ఞాతం వీడిన నగేష్ 1996లో నరుూం గ్యాంగ్‌లో చేరి బెదిరింపులు, హత్యలు, కిడ్నాప్ తదితర కేసుల్లో నిందితుడిగా జైల్లో ఉన్నాడు. కాగా పలు కేసుల్లో నిందితుడైన నగేష్ బెయిల్‌పై బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.