రాష్ట్రీయం

మే 29నుంచి టిఎస్ పిజి ఇసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పిజి కోర్సులు ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో చేరేందుకు టిఎస్ పిజిఇసెట్‌ను తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఈ పరీక్షను మే 29,30,31, జూన్ 1న నాలుగు రోజులు పాటు నిర్వహిస్తామని, ఉదయం ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ ఉంటుందని చెప్పారు. ఇందుకు హైదరాబాద్,వరంగల్ పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, కంప్యూటర్ ఆధారితంగా ఆన్‌లైన్‌లో అభ్యర్ధులు పరీక్ష రాయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాడు టిఎస్‌పిజిఇసెట్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులు రూ. 800 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని, మార్చి రెండో వారంలో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పారు. ఈసారి పిజిఇసెట్ బాధ్యతను ఉస్మానియాకు అప్పగించామన్నారు.