రాష్ట్రీయం

ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం నాడిక్కడ మంత్రుల నివాస సముదాయం వద్ద తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసిన కృష్ణమాదిగ ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు పెరిగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. దాడులు, హత్యలు పెరిగాయని, గతంలో నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదని హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 433 ఎస్సీ, ఎస్టీలపై దాడి జరిగిన కేసులు నమోదు కాగా ఒక్క కేసులోనూ జిల్లా కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోలేదని అన్నారు.