రాష్ట్రీయం

వివక్ష సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, ఫిబ్రవరి 25: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భారతీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, అమెరికా ప్రభుత్వం అందరికీ రక్షణ కల్పించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ణ వివక్షత వల్లనే భారతీయులు, ఇతర దేశస్థులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం అందరికీ రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, కాన్సులేట్ జనరల్ కాథరిన్ కోసం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే సెలవు అన్న పేరుతో అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమెరికాలో భారతీయులపై దాడి జరుగుతుంటే..హైదరాబాద్‌లోని కాన్సులేట్ కనీసం సానుభూతి చూపకపోవడం విచారకరమన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎంఆర్‌జి వినోద్‌రెడ్డి, రఘుపాల్, తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, రేఖ, ఎన్నారై విద్యార్థి తల్లిదండ్రుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్, కృష్ణమాచార్యులు, నగర ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి పాల్గొన్నారు.