రాష్ట్రీయం

ప్రధాని మోదీ గళం విప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ జీడిమెట్ల, ఫిబ్రవరి 25: అమెరికాలో జాత్యాహంకారంతో జరిపిన దాడుల్లో మన వాళ్లు మృతి చెందడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం విప్పాలని, విదేశాంగ శాఖ ద్వారా నిరసన తెలియజేయాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు. శనివారం నగర శివారు ప్రాంతంలోని గండిమైసమ్మ దుందిగల్ మండలం, మల్లంపేట్ గ్రామం, ప్రణీత్ నేచర్ బౌంటీలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మంత్రులు కేటిఆర్, పి.మహేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, ఎంపి బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, ఎమ్మెల్సీ రాజు, గ్రేటర్ తెరాస అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పరామర్శించారు.
మంత్రులు కేటిఆర్, మహేందర్‌రెడ్డిలు మృతుడు శ్రీనివాస్ తల్లిదండ్రులైన మధుసూదన్ రావు, వర్ధినిలతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపారు. శ్రీనివాస్ భార్య సునయన అమెరికా నుంచి మాట్లాడిన వీడియోను మంత్రులు వీక్షించారు. అనంతరం మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వంశీరెడ్డి, శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై అమెరికాలో జరిగిన దాడులు కలచివేసే ఘటనలని అన్నారు.
అక్కడ ఉద్యోగాలు ఇవ్వక పోతే ఇండియాకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు, కానీ ఉన్మాద ధోరణి మంచిదని కాదని అన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిసి సమస్యను వివరిస్తానని అన్నారు. అమెరికాలో ఉన్న భారతీయలు తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలని కెటిఆర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని అన్నారు. తాను అమెరికాలో ఎనిమిదేళ్లపాటు ఉన్నానని, అప్పటి అమెరికా వేరు, ఇప్పటి అమెరికా వేరు అని అన్నారు. దాడులు జరపడం ఒక ట్రెండ్‌గా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భయానక వాతావరణం మనకు మనమే సృష్టించుకోవడం మంచిది కాదని, జాగ్రత్తగా ఉండడం మంచిదని అన్నారు. త్వరలోనే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. మంచి అవకాశాల కోసం అమెరికా వెళ్లిన శ్రీనివాస్ దుర్మరణం పాలు కావడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు కెటిఆర్ చెప్పారు. లీగల్ కార్యక్రమాలు పూర్తయిన తరువాత సోమవారం రాత్రి 8.45 నిమిషాలకు ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో శ్రీనివాస్ భౌతిక కాయం హైదరాబాద్‌కు వస్తుందని కెటిఆర్ చెప్పారు. శ్రీనివాస్ కుటుంబానికి, అలోక్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ సంఘటన గురించి తెలియగానే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఓఎస్‌డితో మాట్లాడినట్టు కెటిఆర్ తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో శ్రీనివాస్ తల్లిదండ్రులు మధుసూదన్‌రావు, వర్ధినిలను పరామర్శిస్తున్న మంత్రులు కెటిఆర్, మహేందర్‌రెడ్డి