రాష్ట్రీయం

త్వరలో నిరుద్యోగ భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26:రాష్ట్రంలో రాజకీయ అంశంగా మారిన నిరుద్యోగ భృతి డిమాండ్ పరిష్కారానికి తెలుగుదేశం పొలిట్‌బ్యూరో ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. త్వరలో విద్యార్హతను బట్టి భృతి ఇవ్వాలని పేర్కొంటూ, ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 10లక్షల కొత్త ఇళ్లు, మార్చి 2న అసెంబ్లీ భవనం ప్రారంభించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు ఆదివారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేఖర్లకు వెల్లడించారు.
ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ చదివిన నిరుద్యోగులకు వెయ్యి నుంచి 2వేల రూపాయల వరకూ భృతి ఇవ్వాలని పొలిట్
బ్యూరో తీర్మానించింది. ‘ఈవిషయంలో మనం ఎక్కడా రాజీపడం. ప్రతిపక్షాలు మన హామీ గుర్తుచేయనవసరం లేదు. వాళ్లడిగితే మనం హామీ ఇవ్వలేదుకదా? నిరుద్యోగ భృతి ఇస్తూనే వారిని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేద్దామ’ని సమావేశంలో బాబు వ్యాఖ్యానించారు. ఇక రైతులకు 1600 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు రానున్నాయని బాబు చెప్పారు. మీడియం, చిన్నతరహా పరిశ్రమలకు ఒక అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకేసారి ఎన్నికల విధానాన్ని సమర్థించాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. ‘లేకపోతే ఏడాది పొడుగునా ఏదోఒక ఎన్నికలు జరుగుతాయి. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోంది. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. ఇప్పుడు విభజన చట్టంపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే యుపిలో ఎన్నికలు జరుగుతున్నందున ఆలస్యమవుతోంది. రెండింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాలకు సమస్యలుండవ’ని బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రాలకు ఇళ్ల కేటాయింపు విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ‘కేంద్రం చేసిన సర్వేలో యుపికి 50 లక్షల ఇళ్లు, మనకు కేవలం 5 లక్షల ఇళ్లే ఇవ్వాలని సర్వేలో తేల్చారు. ఆ సర్వేలో వాస్తవం లేదు. రీసర్వే చేసి మనకు 10 లక్షల ఇళ్లు ఇవ్వాలని కోరదామ’ని బాబు చెప్పారు.
‘మా పార్టీ యువనేత లోకేష్‌ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు పార్టీనే అధ్యక్షుడికి సిఫార్సు చేసింది. ఆయన త్వరలో ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెడతారు. కొత్త అసెంబ్లీ కార్యాలయం మార్చి 2 నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. త్వరలో తొలివిడత అన్న క్యాంటీన్లు కార్పొరేషన్ల స్థాయిలో ప్రారంభించాలని నిర్ణయించాం. గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడంచెల వ్యవస్థ పునరుద్ధరణపై కేంద్రాన్ని కోరనున్నాం. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తీర్మానించాం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబు నాయుడుకే అప్పగిస్తూ తీర్మానించామ’ని పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేఖరులకు వివరించారు.

చిత్రం..టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు