రాష్ట్రీయం

లోకేష్‌కు లైన్‌క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగుదేశం పార్టీ ఉత్తరాధికారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాసనమండలి సభ్యుడిగా త్వరలో చట్టసభలో అడుగుపెట్టనున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలంటూ ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఆమేరకు పొలిట్ బ్యూరో సభ్యుల సిఫార్సులను పార్టీ ఆమోదించింది. ఆదివారం దాదాపు మూడు గంటలసేపు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ వ్యవహారాల్లో కష్టపడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్న పార్టీ యువనేత లోకేష్ సేవలు ఇప్పుడు ప్రభుత్వానికీ అవసరమైనందున ఆయనకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సభ్యులంతా సూచించగా పార్టీ అధినేత బాబు అంగీకరించారు. ఇక పార్టీ సంస్థాగత విషయాలు, ప్రభుత్వ వ్యవహారాలపై బాబు సుదీర్ఘంగా మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పేదలకు 10 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని సభ్యులు కోరగా బాబు అంగీకరించారు. నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. ఈ మూడేళ్లూ ప్రభుత్వంపై దృష్టి సారించడం వల్ల పరిపాలన గాడిలో పడిందని, ఇకపై పూర్తిస్థాయిలో పార్టీపై దృష్టి సారిస్తానని బాబు చెప్పారు.
ఈసందర్భంగా తెలంగాణ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘టిడిపి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీపక్కన ఎవరున్నారో వారినే పక్కన పెట్టుకోవాలి.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాల’ని పార్టీ అధినేతకు సూచించారు. తెలంగాణలోని అన్ని కొత్త జిల్లాల్లోనూ ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇరిగేషన్‌లో పనులు తెలంగాణలో కంటే ఆంధ్రలోనే బాగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన బాబు, పాతవారికి పెద్దపీట వేస్తూనే పార్టీలో చేరినవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మనం చాలామందికి హామీలిచ్చామని, వారికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త-పాత నేతల కలయికతో ముందుకెళ్దామన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పదవులు ఉంటాయని బాబు సంకేతాలిచ్చారు. పార్టీలో ఎవరైనా కలసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో 50 అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని, దీంతో ఎమ్మెల్సీ సీట్లు కూడా కొన్ని కొత్తగా వస్తాయని భరోసా ఇచ్చారు. సమావేశంలోనే ఉన్న అయ్యన్నపాత్రుడిని చూపిస్తూ గుంటూరు, అనంతపురం, విశాఖ నాయకులకు ఇదే చెప్పానని బాబు అన్నారు. అంతలో జోక్యం చేసుకున్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ‘సార్.. మీరు చెప్పినట్లు ఇద్దరూ కలిసి కారులో వెళ్లి సెల్ఫీలు తీసుకుని మీడియాకు పంపి, బ్రిడ్జి దిగిన తర్వాత ఎవరి కారులో వాళ్లు వెళ్లారు’ అని చెప్పినట్లు సమాచారం. నిరుద్యోగ భృతి విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఖండించాలని బాబు ఆదేశించారు. త్వరలో దానికి సంబంధించి నిర్ణయం ప్రకటిద్దామన్నారు. మోత్కుపల్లి నర్సింహులు, ప్రతిభాభారతి, ఎల్ రమణ, కాలవ శ్రీనివాసులు, హరికృష్ణ సమావేశానికి హాజరయ్యారు.