రాష్ట్రీయం

ధనమే ఇంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన కడప స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు కీలకపాత్ర పోషిస్తోంది. ఇరు శిబిరాలు కలిపి రూ.90కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కడపలో చిన్నాన్నను గెలిపించుకోవడం ద్వారా జిల్లాలో తన పట్టు కొనసాగించుకునేందుకు వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి శ్రమిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తొలిసారిగా సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. అటు జగన్ బాబాయిని ఓడించి జగనే ఓడిపోయారనే సంకేతాలిచ్చి, రాజకీయంగా ఆయనను దెబ్బకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ కూడా ధారాళంగా ఖర్చుపెడుతోంది. నేతలకు టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ దిశానిర్దేశం చేస్తుండగా, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
కాగా, రెండు పార్టీల అవసరాలను గుర్తించిన స్థానిక సంస్థల ప్రతినిధులు భారీ స్థాయిలో డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే శిబిరాల్లోకి వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులకు రూ. 7 నుంచి 10 లక్షల వరకూ ధర పలుకుతున్నట్లు చర్చ జరుగుతోంది. కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలకు భారీగానే డిమాండ్ పలుకుతోంది. కమలాపురం నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఉన్న ప్రతినిధులకు ఏకంగా రూ. 30 లక్షల ధర పలికినట్లు సమాచారం. గతంలో తమ పార్టీలో ఉండి, ప్రస్తుతం తెలుగుదేశం శిబిరంలో ఉన్నవారు ఓటింగ్ సమయానికి క్రాస్ ఓటింగ్ చేస్తారని, ఆమేరకు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన డబ్బు కూడా ప్రభావం చూపుతుందని వైసిపి శిబిరం ఆశతో ఉంది. ఈ ఆశతోనే తమకు సాంకేతికంగా సంఖ్యాబలం లేకపోయినా 200 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వైసిపి అంచనా పనిచేయదని తెదేపా నేతలు చెబుతున్నారు. ‘ఒకసారి డబ్బు తీసుకున్న తర్వాత క్రాస్ ఓటింగ్ చేయడం అసాధ్యం. ఎందుకంటే మేమిచ్చిన డబ్బును మళ్లీ వాళ్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. మేము అధికారంలో ఉన్నందున వాళ్లు అలాంటి సాహసం చేయలేరు. కడపలో మా పార్టీ మునుపటి స్థాయిలో బలహీనంగా ఏమీలేదు. ఇక్కడ సోమిరెడ్డి అందరినీ కలుపుకొని పోతున్నారు. అభ్యర్థిపై అసంతృప్తి ఉన్నప్పటికీ వెన్నుపోటు, సహాయ నిరాకరణ అంతా ఉత్తిదే. ఎన్ని పదవులిచ్చినా జగన్‌ను వీక్ చేయలేకపోతున్నామన్న విమర్శ ఉంది. దాన్ని పోగొట్టుకుంటేనే మా అందరికీ రాజకీయంగా మనుగడ. అందుకే అంతా కష్టపడుతున్నాం’ అని ఆ జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత ఒకరు వివరించారు.