రాష్ట్రీయం

అబద్ధాలకోరు కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/షాద్‌నగర్, ఫిబ్రవరి 26: ముఖ్యమంత్రి నోరు విప్పితే అన్నీ అబద్ధాలేనని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలో జరిగిన జనఆవేదన సమ్మేళనం సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. కేసిఆర్ చెప్పిన మాటలకు సార్థకత ఉండదని, మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1350మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన ఘనత కేసిఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు. పూటకోమాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్న సిఎం కెసిఆర్‌కు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేడు కెసిఆర్ మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
నోట్ల రద్దుతో సంక్షోభం: జైపాల్‌రెడ్డి
నోట్లరద్దుతో నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన నరేంద్రమోదీ నేటివరకు ఒక్క రూపాయి వెలికితీయకపోవడం ఘోర వైఫల్యమేనని కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. జనఆవేదన సమ్మేళనం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ నోట్ల రద్దుతో చిన్నకారు, సన్నకారు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా దేశం పదేళ్లు వెనక్కి నెట్టివేసిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రి నరేంద్రమోడి హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి