రాష్ట్రీయం

విద్యారంగ పరిరక్షణకు పోరాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 26: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఉర్దూ ఘర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) ప్రథమ మహాసభలో ఆయన ప్రసంగించారు. విద్యారంగంతో పాటు రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ నిర్వహించిన నిరసన ర్యాలీని అడ్డుకోవడాన్ని ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ ఒక బడా కాంట్రాక్టరుకే అప్పగించటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 50 టిఎంసిల నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో టిపిటిఎఫ్ నాయకులు మనోహర్ రాజు, హన్మంతు, రామారావు, ప్రసాద్, సరళ, తదితరులు పాల్గొన్నారు.