రాష్ట్రీయం

బాలింతలకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే గర్భిణిలకు ఇకనుంచి మూడు విడతల్లో రూ.12 వేలు చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రసవించే బిడ్డ ఆడ శిశువు అయిన పక్షంలో అదనంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తామన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులతో రూ.2 వేల వ్యయం చేసే కిట్‌ను ప్రభుత్వం బహుమానంగా అందజేస్తుందన్నారు. ఈ కిట్‌కు కెసిఆర్ కిట్‌గా నామకరణం చేయాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు. పేదలు ఎక్కువగా వచ్చే ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ అధికారులు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో ప్రగతి భవన్‌లో సోమవారం సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాలింతలు, శిశువులకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో మాతా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా కాపాడుతాం. పేద గర్భిణిలు ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణిగా ఉండి కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్లడం అత్యంత బాధాకరం. అందుకే ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత తల్లీబిడ్డల బాధ్యతను ఇకనుంచి ప్రభుత్వం తీసుకుంటుంది’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. గర్భిణిలు, బాలింతలు, శిశువులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద పోషకాహారం, పాలు, గుడ్లు అందిస్తామన్నారు. గర్భిణిలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ‘తెలంగాణ తల్లులు జన్మనిచ్చే పిల్లలు రేపటి తెలంగాణ సంపద. వారు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది’ అన్నారు. అందుకే వారికి మంచి పోషణకు ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఇకనుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణిలకు సన్న బియ్యంతో భోజనం పెట్టాలని నిర్ణయించామన్నారు. దీనిని వచ్చే నెల నుంచే అమలు చేస్తామన్నారు. అలాగే ‘మే’ నెలలో విపరీతంగా ఎండల వల్ల గర్భిణిలు, బాలింతలు, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం ఇబ్బందికరంగా ఉంటుందని, వారికి ఆ నెలకు సంబంధించిన పోషకాహారాన్ని నేరుగా ఇళ్లకే పంపించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.