రాష్ట్రీయం

వేతన వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అంగన్‌వాడీ వర్కర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రూ.7000లను రూ.10,500కు, అంగన్‌వాడీ హెల్పర్లకు చెల్లిస్తున్న రూ.4200ను రూ.6000కు పెంచినట్టు ప్రకటించారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. వేతనాల పెంపుతో రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. అలాగే అంగన్‌వాడీ వర్కర్లను ఇకనుంచి అంగన్‌వాడీ టీచర్లుగా పేరు మార్చినట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో సోమవారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు భోజనం ఏర్పాటు చేసి అనంతరం వారితో జనహితలో సిఎం సమావేశమయ్యారు. జిల్లాకు ఐదుగురు ప్రతినిధుల చొప్పున ఆహ్వానించి ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి ముఖాముఖిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం చెల్లించే రూ. 7000ను రూ.9000కు పెంచుతామన్నారు. అయితే తమకు రూ.9000 కాకుండా రౌండ్ ఫిగర్ రూ.10 వేలకు వేతనం పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై సిఎం స్పందిస్తూ కేంద్రం కనీస వేతనాన్ని రూ.10,500గా ప్రకటించడంతో అంతే మొత్తాన్ని చెల్లించి భవిష్యత్‌లో మరింత పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి అంగన్‌వాడీ వర్కర్లకు 4200, హెల్పర్లకు రూ.2,200 వేతనం చెల్లించేవారని, దీనిని తమ ప్రభుత్వం రూ. 4200ను రూ. 7వేలకు, రూ.2200లను రూ.4500కు పెంచిందని గుర్తు చేశారు. తాజాగా దీన్ని రూ.10,500కు, రూ.6000కు పెంచుతున్నట్టు వివరించారు. తొలి విడతలో అంగన్‌వాడీలకు పెరిగిన వేతనం 50శాతం, తాజాగా పెరిగిన మొత్తం 150 శాతమని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే తొలి విడతలో అంగన్‌వాడీ హెల్పర్లకు పెరిగిన వేతనం 33.3 శాతం, తాజాగా పెరిగిన వేతనం 172 శాతమన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు వారి సీనియార్టీ, అర్హతలను పరిగణనలోకి తీసుకుని సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పించనున్నట్టు ప్రకటించారు.

చిత్రం..జనహితలో అంగన్‌వాడీలను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఎం కె చంద్రశేఖర్ రావు