రాష్ట్రీయం

కబ్జాలను కూల్చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: చారిత్రక కట్టడాల వద్ద కబ్జాలను అరికట్టేందుకు, అక్రమ భవనాలు తొలగించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ప్రతి కట్టడం, ప్రాంతం జియో ట్యాగ్, పెన్సింగ్ చేయాలని ఆదేశించారు. చారిత్రక ప్రదేశాలతో కూడిన యాప్ తయారు చేయనున్నట్టు చెప్పారు. చార్మినార్, గొల్కొండ, కుతుబ్ షాహీ కట్టడాలకు యునెస్కో హోదా కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను సైతం ఉపయోగించుకుంటామన్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌పై యునెస్కోకు ప్రతిపాదించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. యునెస్కో గుర్తింపు లభించే కట్టడాలలో టాప్ 10లో ఉన్న గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్‌షాహీ చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాల పరిరక్షణకు అవసరమైన చర్యలు
తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను తొలగించాలని నిర్ణయించారు. డిజిటల్ హెరిటేజ్ ప్రాజెక్టులో భాగంగా చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కెటిఆర్ ఆదేశించారు. ప్రతి కట్టడం, ప్రాంతం జియో ట్యాగ్, జియో పెన్సింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ కట్టడాలకు యునెస్కో హోదా కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని కెటిఆర్ తెలిపారు. దీనికి అవసరం అయిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. హెచ్‌ఎండిఎ, మున్సిపల్ రెవెన్యూ, పోలీసు శాఖతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి తెలిపారు. వచ్చే సమావేశం మార్చి ఆఖరు లోగా నిర్వహించాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, టూరిజం కల్చరల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్కియాలజీ సంచాలకులు విశాలాక్షి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..చారిత్రక కట్టడాల రక్షణపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్