రాష్ట్రీయం

డిఎంహెచ్‌ఓ వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఫిబ్రవరి 28: యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాళిదాసాచారి అరెస్టయ్యారు. మహిళా వైద్యులను వేధించిన కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలేరుకు చెందిన క్లస్టర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ క్రాంతికుమారి, డాక్టర్ శృతిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డిసిపి పాలకుర్తి యాదగిరి తెలిపారు. మహిళా వైద్యులపై డిఎంహెచ్‌వో లైంగిక వేధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసి విచారణ జరిపామని, డిఎంహెచ్‌ఓ కాళిదాసాచారిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించామని ఆయన వివరించారు.