రాష్ట్రీయం

అనవసరంగా కోస్తే ఆసుప్రతి సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆయా ఆస్పత్రులను సీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరు ఆస్పత్రులను సీజ్ చేసినట్టు చెప్పారు. ఆస్పత్రుల్లో చేసే ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా తప్పని సరిగా పంపాల్సిందేనని చెప్పారు. ఎఎన్‌ఎంలకు ఆన్‌లైన్ ట్యాబ్ బేస్డ్ యాప్‌ను మంగళవారం సచివాలయంలో తన చాంబర్‌లో మంత్రి విడుదల చేశారు. ట్యాబ్‌లను ఎఎన్‌ఎంలకు పంపిణీ చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేకచోట్ల అవసరం లేకపోయినా సిజేరియన్లు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇక నుంచి అనవసర సిజేరియన్లను ఇతర శస్త్ర చికిత్సలు చేసే ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సిజేరియన్లు, ఇతర శస్తచ్రికిత్సలను నిలువరించేందుకు ప్రతి నెల ఆపరేషన్ల వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించినట్టు చెప్పారు. శస్త్ర చికిత్సల ప్రోటోకాల్ ఉంటుందని, ఆ వివరాల ద్వారా అనవసర ఆపరేషన్లను గుర్తించవచ్చునని చెప్పారు. శస్త్ర చికిత్సల వివరాలు పంపని ఆస్పత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరిచినట్టు చెప్పారు. ఆన్‌మోల్, ఎఎన్‌ఎం ఆన్‌లైన్ అనే ట్యాబ్ బేస్డ్ అప్లికేషన్‌ను వైద్య శాఖ మంత్రి ఆవిష్కరించారు. దీనిలో వైద్య సమాచారం పొందు పరుస్తారు. ఒక ఎఎన్‌ఎం నుంచి మూడువేల నుచి ఐదువేల మంది జనాభాకు సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా రియల్ టైమ్‌లో సమాచారం సంబంధిత అధికారులకు చేరుతుంది. గతంలో నెలకు ఒక సారి మ్యానువల్‌గా రాసేవారు. ఈ ట్యాబ్‌లో గర్బిణీలు, పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సంబంధిత వీడియోలు కూడా పొందు పరిచే వీలుందని చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో 4900 ఎఎన్‌ఎంలకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ట్యాబ్ వినియోగించడంపై శిక్షణ ఇస్తారు. ఈ అన్‌మోల్‌ను దేశంలో అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడవది. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఆఫ్‌లైన్‌లో ఈ యాప్ పని చేస్తుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి రాగానే ఆటోమెటిక్‌గా ట్యాబ్‌లో పొందు పరిచిన సమాచారం నేరుగా సర్వర్‌లోకి వెళుతుందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.