రాష్ట్రీయం

ఆన్‌లైన్ హాల్‌టిక్కెట్‌తో పరీక్షకు హాజరు కావచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టిక్కెట్లతో నేరుగా పరీక్షలకు హాజరుకావచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. డౌన్‌లోడ్ చేసిన హాల్‌టిక్కెట్‌పై ఎవరి సంతకం అవసరం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. డౌన్‌లోడ్ చేసిన హాల్‌టిక్కెట్లపై ప్రిన్సిపాల్ సంతకం ఉండాలనే నిబంధనను సడలించినట్టు ఆయన చెప్పారు. ప్రిన్సిపాల్ సంతకం చేయించాలంటే మళ్లీ వ్యవహారం మొదటికే వస్తుందని విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలు విద్యార్ధులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపణలు రావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బుధవారం నుండి మొదలవుతున్న ఇంటర్ పరీక్షలకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. ఇంటర్ పరీక్షలకు 9,76,631 మంది హాజరవుతున్నారని, అందులో ఫస్టియర్ 4,75,832 మంది, సెకండియర్ 5,00799 మంది ఉన్నారని, వీరికోసం 1291 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం నాడు చెప్పారు.