రాష్ట్రీయం

నీళ్లకోసం మళ్లీ పేచీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/ నాగార్జున సాగర్, ఫిబ్రవరి 28: నాగార్జునసాగర్ జలాశయం నుంచి కృష్ణా కుడి కాల్వకు నీటి విడుదల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పేచీ తలెత్తింది. వాటా జలాలు పూర్తిగా వదల్లేదని ఆంధ్ర, కోటా పూరె్తైందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు మంగళవారం వాగ్వాదానికి దిగారు. గత ఏడాది ఇదే పరిస్థితి తలెత్తి పోలీసులే బాహాబాహీకి దిగడం తెలిసిందే. కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయం ప్రకారం రోజుకు 6 వేల క్యూసెక్కుల సగటున 17 టిఎంసి జలాలు వదలాల్సి ఉంది. ఫిబ్రవరి 3నుంచి మొదలైన ప్రక్రియ ఈరోజుతో పూరె్తైంది. దీంతో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగర్ డ్యాం అధికారులు నీటి విడుదలను క్రమేపీ తగ్గిస్తూ వచ్చారు. సమాచారం తెలుసుకున్న సాగర్ ప్రాజెక్టు ఆంధ్ర చీఫ్ ఇంజనీర్ వీరరాజు ఆధ్వర్యంలో ఎస్‌ఇ, డిఇ, ఇఇలు సాగర్ డ్యాం కంట్రోల్ రూంకు చేరుకున్నారు. కుడి కాల్వకు నీటి విడుదల నిలిపేస్తే సహించేది లేదని తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బోర్డు నిర్ణయం ప్రకారం 17 టిఎంసి విడుదల పూర్తికాలేదని వాదనకు దిగారు. కేటాయింపుల ప్రకారం నీటి విడుదల పూరె్తైందని, శ్రీశైలం నుంచి సాగర్‌కు జలాలు చేరుకునే క్రమంలో ఆవిరవుతున్న నీటిని సైతం లెక్కల్లోకి తీసుకున్నామని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. రెండు రాష్ట్రాల డ్యాం అధికారుల మధ్య ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాగ్వాదాలు కొనసాగాయి. తెలంగాణ అధికారులు నీటి విడుదలకు నిరాకరిస్తే, తామే స్వయంగా విడుదల చేసుకుంటామంటూ ఆంధ్ర అధికార్లు భీష్మించారు. డ్యాం కంట్రోల్ రూంవద్దకు మీడియాను అనుమతించకపోవడంతో, ఏం జరుగుతుందో అర్థంకాని ఉత్కంఠ తలెత్తింది. అదే సమయంలో తెరాస నేతలు సాగర్ ప్రధాన డ్యాంవద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
చివరకు సాగర్ డ్యాం ఎస్‌ఇ రమేష్ ప్రకటనతో వివాదం సద్దుమణిగింది. తెలంగాణ ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆంధ్ర అధికారులు కోరినట్టే జలాల విడుదల కొనసాగిస్తామని, ఉద్రిక్తత నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగడంతో, ఆంధ్ర అధికారులు కంట్రోల్ రూంనుంచి నిష్క్రమించారు.
వివాదంపై సాగర్ డ్యాం సిఇ మాట్లాడుతూ కుడి కాల్వకు విడుదల చేయాల్సిన జలాలు పూర్తిగా ఇచ్చేసినా, ఆంధ్ర అధికారుల వాగ్వాదాలకు దిగారని అన్నారు. ఉద్రిక్తతలకు తావివ్వకూడదనే జలాలు విడుదల చేస్తున్నామని, దీనిపై తెలంగాణ సర్కారు, కృష్ణా బోర్డుతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగుతున్నా, మరోదఫా ఆంధ్రకు ఇవ్వాల్సిన ఐదు టిఎంసిలో అదనపు పరిమాణాన్ని లెక్కల్లోకి తీసుకుంటామని అన్నారు.

చిత్రం..రెండు రాష్ట్రాల డ్యాం అధికారుల మధ్య వాగ్వాదం