ఆంధ్రప్రదేశ్‌

ఐఓటీతోనే యువతకు భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 28: ప్రపంచంలో ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని, నేటి యువత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ డాక్టర్ బాల.వి.బాలచంద్రన్, ప్రొ.్ఛన్సలర్ మోహన్ లఖంరాజు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ పరాగ్ దివాన్ తదితరులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. శ్రీసిటీలో గ్రేట్ లేక్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు ప్రగతిని వివరించారు. విశ్వవిద్యాలయ బ్రోచర్‌ను ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలకు నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని అన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం వచ్చిందని, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా పట్టుదలతో హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని గుర్తుచేశారు. సాయంత్రం అయితే జనం బయట తిరిగేందుకు సైతం భయపడే మాదాపూర్ ప్రాంతంలో సైబరాబాద్ నిర్మించి విశ్వశ్రేణి ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో శాఖలు తెరిచే విధంగా కష్టపడ్డానని చంద్రబాబు తెలిపారు. మైక్రోసాప్ట్, డెలాయిట్, ఒరాకిల్, ఐబిఎం తదితర కంపెనీలు కార్యాలయాలు తెరిచాయని చెప్పారు. రాష్ట్రంలో, దేశ విదేశాల్లో తెలుగువారికి పది లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు ఐటి రంగంలో వచ్చాయని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవ సమయమని, యువత బంగారు భవిష్యత్తును నిర్దేశించే గ్రేట్ లేక్స్ యూనివర్సిటీ లాంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ డాక్టర్ బాల.వి.బాలచంద్రన్ మాట్లాడుతూ శ్రీసిటీలో ఈ ఏడాది జూలై నుంచి యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభమవుతుందని చెప్పారు. బిటెక్‌లో మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్లు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో ఇంకా గ్రేట్ లేక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్తీక్ గోపాలన్, స్టూడెంట్స్ ఎంగేజిమెంట్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ ఎన్.శ్రీనగేష్, సిఎంఓ సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.

చిత్రం.. గ్రేట్ లేక్స్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరిస్తున్న చంద్రబాబు