జాతీయ వార్తలు

మరిన్ని ఆర్థిక సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: దేశంలో మరో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మొత్తం పది ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. కార్మిక శాఖ, వైద్య, ఆరోగ్యం, వాణిజ్య పన్నుల శాఖతోపాటు మొత్తం పది శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ తదుపరి సమావేశాలు ఈ నెల 11 నుండి ప్రారంభం కాగానే కొత్త సంస్కరణలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రతిపాదిస్తారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ 7వ తేదీతో ముగిసిన అనంతరం 11న ఫలితాలు వెలువడుతాయి. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మోదీ ప్రభుత్వం పలు కీలక శాఖల్లో మరిన్ని సంస్కరణలను అమలు చేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన బండారు దత్తాత్రేయ నాయకత్వం వహిస్తున్న కార్మిక శాఖకు సంబంధించి కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాల నియమ, నిబంధనలకు సంబంధించిన రెండు బిల్లులు తయారవుతున్నాయి. ఇదే విధంగా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోకి వచ్చే జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు దాదాపుగా పూర్తి అయిందటున్నారు. జీఎస్టీని అన్ని రాష్ట్రాలు మార్పులు, చేర్పులతో ఆమోదించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు కూడా సిద్ధమవుతోందని అంటున్నారు. ఈ మూడు బిల్లుల ద్వారా కార్మిక, వైద్య, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో భారీ మార్పులు, చేర్పులు చేస్తారని తెలిసింది. ఈ మూడు శాఖలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను పార్లమెంటులో ప్రతిపాదించటంతోపాటు ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కార్యనిర్వాహక ఆదేశాలను (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్) కూడా జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జాతీయ ఇంధన విధానం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ నమునా చట్టం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నియమ, నిబంధనలను మరింత సరళీకరించటంతోపాటు ఆర్థిక మార్గదర్శక సూత్రాలను మరింత సులభతరం చేయనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన జాతీయ వైద్య కమిషన్ ముసాయిదా బిల్లును ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ పరిశీలిస్తోంది. కార్మిక శాఖ మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించాలనుకుంటోంది. కార్మికుల వేతనాలకు సంబంధించిన నియమ, నిబంధనలు, పారిశ్రామిక సంబంధాల నియమ నిబంధనలు, సామాజిక భద్రతా నియమాలు, వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమ, నిబంధనలు అనే నాలుగు చట్టాలు చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మొదటి రెండు చట్టాలకు సంబంధించిన సంస్కరణల ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తారు.