రాష్ట్రీయం

ఎగవేస్తే జైలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: డిపాజిట్లు తీసుకుని ఎగవేస్తున్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అందులో భాగంగా 1999 ఫైనాన్స్ మదుపరుల చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇక డిపాజిట్ ఎగవేతదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేసే అవకాశం ఏర్పడింది. ఈ చట్టసవరణ బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గురువారం వెలగపూడిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో విధుల్లో ఉన్న అధికారులపై ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరించిన తీరును క్యాబినెట్ ఖండించింది. ఆ మేరకు ఆ వీడియోను క్యాబినెట్ వీక్షించింది. ఈ సందర్భంగా మృతులకు సంతాపం ప్రకటించింది. అదే విధంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయంగా, తిరుపతి ఎయిర్‌పోర్టును శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా మార్చాలని నిర్ణయించింది.
ఇవీ మంత్రి మండలి నిర్ణయాలు
* ఆంధ్రప్రదేశ్ విత్తన చట్టం 2017కు చట్టబద్ధత కల్పించే విషయంపై చర్చ జరిగింది. విత్తన చట్టాన్ని శాసనసభలో
ప్రవేశపెట్టబోయే ముందు మరోసారి స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమలులో ఉన్న విత్తన చట్టం 1966 స్థానంలో నూతన చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ప్రతిపాదిత బిల్లుతో రాష్ట్రంలో విత్తన వంగడాల రిజిస్ట్రేషన్ సబ్ కమిటీ ఏర్పాటుచేసి అభివృద్ధిపరచిన వంగడాల వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించే నిబంధన ఏర్పాటు చేశారు. రైతులకు లభించే విత్తనాల గరిష్ట అమ్మకపు చిల్లర ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరఫరా చేసే విత్తన సరఫరాదారులకు రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా, 3 మాసాల కారాగార శిక్ష లేదా 2 శిక్షలు విధించే అవకాశం ఏర్పడుతుంది.
* 2015లో రాష్ట్ర ఉభయ సభల్లో ఆమోదం పొందిన డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లులో సవరణలు తెస్తూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది.
* డిపాజిటర్ల సొమ్ముకు, హక్కులకు మరింత రక్షణ కల్పించేలా బిల్లును పటిష్టపరిచారు. ఎగవేతదారులైన ప్రమోటర్ల ఆస్తులను వేగంగా జప్తుచేసి, ఆస్తులు విక్రయించేలా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.
* వేసవిలో తాగునీటి సరఫరా పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
* రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, మార్కెటింగ్, రైతు సాధికార సంస్థలకు చెందిన రూ.125.40 కోట్లను మార్క్‌ఫెడ్‌కు రావాల్సిన ఎరువుల బకాయిల నిమిత్తం సర్దుబాటు చేయడానికి మంత్రిమండలి నిర్ణయించింది.
* గతంలో 4 లక్షల టన్నుల ఎరువులను ముందస్తుగా కొని నిల్వ చేసి అవసరమైనప్పుడు సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఈ ఎరువుల కొనుగోలు నిమిత్తం రూ.500 కోట్లను రుణంగా తీసుకునేందుకు మరియు దానిపై వడ్డీ, రవాణా మరియు నిల్వ ఉంచేందుకు అవసరమయ్యే ఖర్చులను మార్క్‌ఫెడ్ చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
* ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ యూనివర్సిటీ డ్రాఫ్ట్‌బిల్లు 2017కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రానున్న 3,4 ఏళ్లలో ఈ వర్శిటీకి రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.
* ఆంధ్రప్రదేశ్ మ్యారీటైమ్ బోర్డు డ్రాప్ట్ బిల్లు 2017కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పోర్టు డిపార్ట్‌మెంట్ స్థానంలో పోర్టుల అభివృద్ధి, పరిపాలన కోసం ఆంధ్రప్రదేశ్ మ్యారీటైమ్ బోర్డు ఏర్పాటు చేసింది.
* ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ యూనివర్సిటీ డ్రాఫ్ట్ బిల్లు 2017కు మంత్రిమండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేసి బిల్లును ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
* రూ.150 కోట్లతో చెన్నయ్‌కు చెందిన వీరైయాన్ సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ అమరావతి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి అంగీకరించింది. మొత్తం పదేళ్లలో రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడతామని, ఈ కాలంలో 21,065 మందికి చదువుకునే అవకాశం కలుగుతుందని ట్రస్ట్ ప్రభుత్వానికి ప్రాజెక్టు రిపోర్టు అందించింది.
* శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిఇఇఇ, డిసిఇ డిప్లొమా కోర్సులతో ప్రారంభించేందుకు అనుమతించింది.
* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమిని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కమిటీ లిమిటెడ్‌కు ప్రాథమిక ధరకు అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
భూసేకరణ
* భోగాపురం ఎయిర్‌పోర్టు లిమిటెడ్ రూ.100 కోట్లను భూసేకరణ, ప్రీ డెవలప్‌మెంట్ నిమిత్తం సమకూర్చుకునేందుకు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు మంత్రిమండలి నిర్ణయించింది.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే ఆటోమొబైల్ ఇండస్ట్రీ పాలసీకి ఆమోదం తెలిపింది.
* కృష్ణపట్నం నోడ్‌కు సంబంధించి స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్‌కు మంత్రిమండలి ఆమోదించింది.
* చెన్నయ్-బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్‌లో భాగంగా కృష్ణపట్నంలో 10,368.68 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు కానున్నది.

చిత్రం..గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు