రాష్ట్రీయం

వాస్తు బాగుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2:రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా తయారు చేస్తానని, ప్రపంచ దేశాల్లో మొదటి 10 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతి గర్వపడేలా అభివృద్ధి చేసి నిజాయితీ నిరూపించుకుంటానన్నారు. ఆశీర్వదించి ముందుకు నడిపించాలని ప్రజలను కోరారు. వెలగపూడి సచివాలయ ఆవరణలో నిర్మించిన రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సిఎం మాట్లాడుతూ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవాన్ని చూస్తుంటే ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ కలుగుతోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన చట్టాలను తయారుచేసే అసెంబ్లీని పొలాల్లో నిర్మించుకున్నామన్నారు. ఏదేమైనా సొంతగడ్డపై చట్టాలు చేసుకునే స్థాయికి రావడం చరిత్రన్నారు. ఉమ్మడి మద్రాస్ నుంచి విడివడినప్పుడు కర్నూలులో గుడారాల్లో పాలన సాగించారని గుర్తు చేశారు. 58 ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా పరిపాలన సాగించామన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వచ్చామని, ఇప్పుడు కట్టుబట్టలతోపాటు అప్పులతో కలిసి విడివడ్డామన్నారు. అయినా తక్కువ సమయంలో చేయగలమని నిరూపించుకున్నామన్నారు. తనకు ప్రజలే హైకమాండ్ అన్నారు. తెలుగుజాతి కోసం కృషి చేశానన్న ఆనందం చనిపోయాక కూడా శాశ్వతంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటు కోసం ఫైళ్లను తానే మోసుకువెళ్లానని, ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిచి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని శాశ్వతంగా తెలుగు జాతికి గుర్తుండిపోతుందన్నారు. ఆ అన్యాయాన్ని అధిగమించేందుకు కసిగా పని చేశానని, తన కృషితో తిరుగులేని శక్తిగా తయారు చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఆవేశాలను చూశామని, రాజీవ్ గాంధీ హత్య సమయంలో ఎన్టీఆర్ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. ప్రజలు నమ్మితే మనతో ఉంటారన్నారు. 2022 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తానని, 2029 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామన్నారు. కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, రాష్ట్భ్రావృద్ధి కోసం, భవిత కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నానని తెలిపారు. 16 వేల లోటు బడ్జెట్‌తో ప్రభుత్వ నడపాలంటే ఇంకోకరైతే గుండె ఆగి చనిపోయేవారన్నారు. అగ్రవర్ణల పేదలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
అమరావతి వాస్తు చాలా బాగుందని సిఎం తెలిపారు. ఈశాన్య దిశలో నీరు వెళ్లడం వాస్తుకు సరిగా సరిపోయిందన్నారు. వాస్తు అంతా చూసుకున్నాకే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశానని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం దుర్మార్గులపై, అభివృద్ధిని అడ్డుకునే వారి పట్ల కఠినంగా ఉంటానన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుండేదని ఆయన పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చిత్రాలు.. వేంకటేశ్వరస్వామి ఫొటోతో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలోకి ప్రవేశిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు.
అసెంబ్లీ హాల్‌లో కూర్చుని ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తున్న దృశ్యం.