రాష్ట్రీయం

ఎంత కష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 2:ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నది ఆ విద్యార్థి లక్ష్యం. అయితే అనుకోకుండా తండ్రి హఠాన్మరణం ఆ విద్యార్థిని దుఃఖ సాగరంలో ముంచేసింది. ఉదయం పరీక్ష రాసి, మధ్యాహ్నం తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తన ధర్మాన్ని పాటించాడు. ఈ సంఘటన స్థానికులను కంటతడిపెట్టించింది. విశాఖ నగరంలోని కుమ్మరివీధికి చెందిన ఎ రామకృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లోకేష్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎంవిపి కాలనీలో లోకేష్ పరీక్ష రాయాల్సిన కళాశాలను చూపించి తిరిగి ఇంటికి వచ్చిన రామకృష్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో రామకృష్ణ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాత్రంతా తండ్రి మృతదేహం వద్ద విలపించిన లోకేష్ గురువారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసి, మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి రామకృష్ణ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి, సాధారణ కుటుంబం కావడంతో ఇప్పుడు భారం లోకేష్‌పై పడింది. కష్టపడి చదువుకుని, ఉన్నత శిఖరాలు అందుకోవాలనుకున్న లోకేష్‌పై ఇప్పుడే కుటుంబ భారం పడటం బాధాకరం.

చిత్రం..తండ్రి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తున్న తనయుడు లోకేష్