రాష్ట్రీయం

10నుంచి బడ్జెట్ భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2:బడ్జెట్ సమావేశాలు ముందు అనుకున్నట్టుగా ఈ నెల 8వ తేదీన కాకుండా రెండు రోజులు ఆలస్యంగా 10 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తాజా సమాచారం. బడ్జెట్ సమావేశాలను తప్పనిసరిగా 18 రోజులు నిర్వహించాలన్న నిబంధన ఏమీ లేకపోవడంతో ఈసారి 16 రోజులు మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గవర్నర్ నోటిఫికేషన్ రెండు రోజులలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈనెల 10న బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 11న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదిస్తారు. 12న ఆదివారం సెలవురోజు కావడంతో 13న సోమవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఈ వర్గాల సమాచారం. బడ్జెట్‌పై అధ్యయనం చేయడానికి 14వ తేదీన సభకు సెలవు ప్రకటించి 15వ తేదీ నుంచి బడ్జెట్ పద్దులపై వారం రోజులు చర్చ జరిగిన అనంతరం 23వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించనున్నట్టు తెలిసింది. బడ్జెట్‌కు ఆమోదం పొందిన తర్వాత సభను రెండు రోజులు మాత్రమే కొనసాగించే పక్షంలో 25వ తేదిన, నాలుగు రోజులు కొనసాగించే పక్షంలో 28న సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందని తెలిసింది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్నది ఈ నెల 10వ తేదీన జరుగనున్న బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశంలో ఖరారు అవుతుందని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో అవిర్భవించడంతో ఆ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు 16 రోజులు మాత్రమే జరిగినట్టు ఈ వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఇలా ఉండగా ఈ నెల 28న బడ్జెట్‌ను ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేయాలని మొదటి ప్రభుత్వం భావించినట్టు తెలిసింది. అయితే 28న అమావాస్య, 27న చతుర్దశి శుభ దినాలు కాకపోవడంతో 23వ తేదీ దశమి రోజునే బడ్జెట్‌ను ఆమోదించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. బడ్టెట్ సమావేశాలను 26న ముగించే పక్షంలో ఆ రోజు ఆదివారం అయినప్పటికీ సభ నిర్వహించే అవకాశం ఉందని, అలా కాని పక్షంలో 19వ తేదీన ఆదివారం సభ జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇలా ఉండగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగానికి ఆమోదం తెలపడానికి ఈ నెల 6న మంత్రిమండలి సమావేశం జరిగే అవకాశం ఉంది.